Viral News: తనని తాను చుట్టుకుని ఆత్మ హత్య చేసుకున్న పాము.. షాకింగ్ ఫోటో వైరల్

|

Sep 17, 2024 | 11:39 AM

ఎప్పుడైనా పాము ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అసలు పాములు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని ఆలోచన అయినా చేశారా.. వాస్తవానికి పాముని చూస్తే చాలు మనుషులు భయంతో పరుగులు తీస్తారు.. అయితే తాజాగా పాము ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి షాక్ అయ్యి రెడ్‌డిట్‌లో షేర్ చేశాడు. ఈ చిత్రంలో పాము తనంతట తానుగా చుట్టుకుని ఊపిరి ఆడక 10 నిమిషాల తర్వాత తుది శ్వాస విడిచింది.

Viral News: తనని తాను చుట్టుకుని ఆత్మ హత్య చేసుకున్న పాము.. షాకింగ్ ఫోటో వైరల్
Snake Sucide
Image Credit source: Image: reddit.com
Follow us on

చాలా మంది జీవితంతో విసిగిపోయి తమ జీవితాలను తామే ముగించుకుంటున్నారు. రకరకాల పద్దతిలో ఆత్మహత్య చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నారు. వీడియోలు చాలా మంది చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా పాము ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అసలు పాములు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని ఆలోచన అయినా చేశారా.. వాస్తవానికి పాముని చూస్తే చాలు మనుషులు భయంతో పరుగులు తీస్తారు.. అయితే తాజాగా పాము ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి షాక్ అయ్యి రెడ్‌డిట్‌లో షేర్ చేశాడు. ఈ చిత్రంలో పాము తనంతట తానుగా చుట్టుకుని ఊపిరి ఆడక 10 నిమిషాల తర్వాత తుది శ్వాస విడిచింది. వైరల్ అవుతున్న పాము ఫోటో చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇది చూసిన వారి మదిలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఫోటోలో పాము తన చుట్టూ చుట్టుకుని కనిపించింది. పాము తన తోకతో తన నోటిని గట్టిగా పట్టుకుంది. ఫోటోను షేర్ చేసిన వారు ఈ పాము తనను తాను గొంతు పిసికి చంపుకుందని .. ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ 10 నిమిషాల తర్వాత చనిపోయిందని చెబుతున్నారు. ఈ జంతువులు, పాములు ఎప్పటి నుండి ఆత్మహత్య చేసుకోవడం ప్రారంభించాయి అని ఇప్పుడు ప్రజలు అంటున్నారు.

సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అయింది

ఇవి కూడా చదవండి

Yesterday I found a snake which was strangling himself, after 10 minutes he died
byu/FrontalisUtkozes ininterestingasfuck

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను 74 వేల మందికి పైగా లైక్ చేయగా, ఐదు వేల కామెంట్స్ వచ్చాయి. కొందరు అబద్ధం అంటుంటే మరికొందరు సరదాగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ సోషల్ మీడియా యూజర్ నిజంగా పాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమేనా.. లేక అది కేవలం పుకార్లేనా అని కామెంట్ చేశారు. అసలు పాము గొంతు నొక్కుకుని ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమేనా అని ఒకరు రాశారు. 10 నిమిషాల పాటు ఆత్మహత్య చేసుకుంటుంటే అది చూస్తూ మృతదేహాన్ని ఫోటోలు తీశారని ఒకరు రాశారు. పాము చనిపోతుంటే.. ఈ వ్యక్తి ఫోటోలు క్లిక్ చేయడంలో బిజీగా ఉన్నాడని ఒకరు కామెంట్ చేశారు.

విషపూరితమైన వాతావరణం కారణంగానే అది చనిపోయి ఉంటుందని కొందరు అంటున్నారు. IFL సైన్స్ ప్రకారం, ఒత్తిడి, దృష్టి లోపం, అధిక ఉష్ణోగ్రత పాములను గందరగోళానికి గురిచేస్తాయి. పాము ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం సేకరణలో భాగంగా పాములు పాము కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే జన్యు ఉత్పరివర్తన వలన సంభవించే అసాధారణ ప్రవర్తన, సర్పెంటైన్ ఆటోస్ఫోకేషన్ సిండ్రోమ్ అనే ప్రాణాంతక వ్యాధి అభివృద్ధి అయితే ఊపిరాడకుండా చనిపోతాయి.ఈ పాము విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని, దాని వల్లే అది చనిపోయిందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..