Viral Video: ఇంత పైత్యమా..?ప్రీ-వెడ్డింగ్ షూటా లేక సూసైడ్ ప్రాక్టీసా? వైరల్ అవుతున్న వింత వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింతైన ప్రీ-వెడ్డింగ్ షూట్ (Pre-wedding shoot) వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని కాన్సెప్ట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా, రకరకాల విమర్శలు, జోకులు పేలుస్తున్నారు. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో వధూవరుల విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా కనిపించే రొమాంటిక్ సన్నివేశాలకు భిన్నంగా, ఈ జంట ఎంచుకున్న నేపథ్యం చాలా భీభత్సంగా ఉంది. ఇది చూసిన ఎవరికైనా ఇది పెళ్లి వేడుక అని నమ్మడం కష్టమే.

Viral Video: ఇంత పైత్యమా..?ప్రీ-వెడ్డింగ్ షూటా లేక సూసైడ్ ప్రాక్టీసా? వైరల్ అవుతున్న వింత వీడియో.. షాక్‌లో నెటిజన్లు!
Weird Pre Wedding Shoot

Updated on: Mar 19, 2026 | 8:41 AM

పెళ్లిని జ్ఞాపకంగా మార్చుకోవడానికి నేటి తరం జంటలు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి హద్దులు దాటుతున్నాయి. లొకేషన్లు, కాస్ట్యూమ్స్ విషయంలో పోటీ పడుతున్న వారు, వింత వింత థీమ్‌లతో జనం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక వింతైన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో (@rose_k01) అనే ఖాతా ద్వారా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో వధూవరుల విన్యాసాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా కనిపించే రొమాంటిక్ సన్నివేశాలకు భిన్నంగా, ఈ జంట ఎంచుకున్న నేపథ్యం చాలా భీభత్సంగా ఉంది. ఇది చూసిన ఎవరికైనా ఇది పెళ్లి వేడుక అని నమ్మడం కష్టమే.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. జోకులు ఆటంబాంబుల్లా పేలుతున్నాయి. ఇది ప్రీ-వెడ్డింగ్ షూట్ కాదు, క్రైమ్ పెట్రోల్ షూటింగ్ లాగా ఉంది అని కొందరు కామెంట్ చేశారు. దీనిని షూట్ అనడం కంటే ప్రీ-డెత్ షూట్ లేదంటే సూసైడ్ ప్రాక్టీస్ అనడం సబబు అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత సృజనాత్మకత (Creativity) పేరుతో ఎంతటి పిచ్చి పనులకైనా తెగిస్తున్నారని, ఇలాంటివి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..

ఇవి కూడా చదవండి

ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరిట ఒక జంట నీటిలో తేలుతూ ఫోజులిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కూడా వారికి అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ డైరెక్షన్స్‌ చెబుతున్నాడు. అందమైన లోకెషన్స్ లో ఫోటోలు దిగాల్సిన కొత్త జంట ఇలాంటి చిత్ర విచిత్రమైన ఫోటో షూట్ లు చేస్తూ విమర్శల పాలవుతున్నారు.

ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తాపత్రయంతో కొందరు జంటలు ఇబ్బందికరమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. పండుగలా జరుపుకోవాల్సిన పెళ్లి వేడుకలను ఇలా వింత విన్యాసాలతో అపహాస్యం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us