
సాధారణంగా రోడ్లపై నిత్యం మనం ఎన్నో రకాల వాహనాలను చూస్తుంటాం..వీటిలో మోడిఫై చేసిన విభిన్న కస్టమ్ కార్లు, స్పోర్ట్స్ కార్లను చూస్తుంటాం. కానీ, ఎప్పుడైనా గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డుపై కార్ల మధ్య సాధారణంగా వెళ్లడం చూశారా? అమెరికాలోని ఫ్లోరిడాలో సరిగ్గా అలాంటి వింత, ఆసక్తికరమైన దృశ్యమే చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని డేటోనా బీచ్ వద్ద ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తుండగా, రోడ్డుపై వెళ్తున్న ఒక వాహనం వారి దృష్టిని ఆకర్షించింది. మొదటి చూపులోనే అది ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానంలా కనిపించింది. గాల్లో ఎగరాల్సిన ఆ విమానం రోడ్డుపై కార్లు, ఇతర వాహనాల మధ్య వేగంగా వెళ్తుండటంతో వారు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఆ వాహనాన్ని పరిశీలించి చూడగా, అది ఆకాశంలో ఎగిరే అసలైన విమానం కాదని తేలింది. ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానం బాడీ ఫ్రేమ్‌ను కస్టమ్ డిజైన్ చేసి, చక్రాలు అమర్చి కార్ రూపంలో తయారుచేశారు. దాని లుక్, ఫినిషింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే చూసేవారు ఎవరైనా సరే దాన్ని నిజమైన విమానంగా పొరబడాల్సిందే. అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా తయారుచేసిన ఈ ప్లేన్ కార్ సాధారణ రోడ్డుపై ఇతర వాహనాలతో పాటు సాఫీగా సాగిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి…
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే నిమిషాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇది నేలపై నడిచే నిజమైన ఎగిరే వాహనం అని కొందరు అంటుంటే, మరికొందరు ఈ వాహనాన్ని తయారుచేసిన వ్యక్తి సృజనాత్మకతను, డిజైన్ నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత కారు వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.