Viral: ప్రయాణీకులకు వింత అనుభవం.. లగేజీ లేకుండానే విమానాల్లో వెళ్లిపోయారు.. ఎయిర్‌పోర్ట్‌లోనే 1500 బ్యాగులు

|

Jul 03, 2022 | 10:48 AM

International News in Telugu: లగేజీ లేకుండానే విమానాశ్రయాల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుని ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాశ్రయంలో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగానే ప్రయాణీకులకు అసౌకర్యం కలిగినట్లు ఆపరేటింగ్ కంపెనీ తెలిపింది.

Viral: ప్రయాణీకులకు వింత అనుభవం.. లగేజీ లేకుండానే విమానాల్లో వెళ్లిపోయారు.. ఎయిర్‌పోర్ట్‌లోనే 1500 బ్యాగులు
Airport Baggage Counters
Follow us on

Paris Airport: పారిస్ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురయ్యింది. పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం నుంచి 15 విమానాలు లగేజీ లేకుండానే ప్రయాణీకులతో బయలుదేరి వెళ్లాయి. కనీసం 1,500 బ్యాగులు, సూట్‌కేస్‌లు విమానాశ్రయంలోనే నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. లగేజీ లేకుండానే విమానాశ్రయాల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుని ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాశ్రయంలో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగానే ప్రయాణీకులకు అసౌకర్యం కలిగినట్లు ఆపరేటింగ్ కంపెనీ తెలిపింది.

అధిక నియామకాలు చేపట్టడంతో పాటు వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ విమానాశ్రయ కార్మికులు ఫ్రాన్స్‌లోపి విమానాశ్రయాలలో సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మె కారణంగా విమానయాన అధికారులు శుక్రవారం పారిస్ విమానాశ్రయం నుండి 17 శాతం విమానాలను రద్దు చేయగా.. శనివారంనాడు మరో 14 శాతం విమానాలను రద్దు చేశారు. కార్మికుల సమ్మె కారణంగా విమానాశ్రయం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. సాంకేతిక సమస్య ఏర్పడితే దాన్ని సరిచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణీకుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

15 విమానాల్లో తమ లగేజీలు లేకుండానే ప్రయాణీకులు పారిస్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. తమ సమ్మె కారణంగా ఏర్పడిన నిర్వహణ వైఫల్యం కారణంగా ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించి.. విమానాశ్రయంలో ప్రయాణీకులకు అందిస్తున్న సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

విమానాశ్రయ కార్మిక సంఘాలు ఆదివారం కూడా ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో సమ్మెను కొనసాగించే యోచనలో ఉన్నాయి. అయితే విమానాల రద్దుకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తమ చర్చలు సఫలంకాకుండా వచ్చే వీకెండ్ నుంచి తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..