Ukraine: ఉక్రెయిన్ కు మరోసారి అమెరికా సహాయం.. సైనిక శక్తిని అందిస్తూ ఆపన్నహస్తం

రష్యా (Russia) దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు మరోసారి ఆపన్నహస్తం అందించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు మరోసారి సహాయం అందిస్తూ ఉపశమనం కలిగించింది. ఉక్రెయిన్‌కు 820 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని....

Ukraine: ఉక్రెయిన్ కు మరోసారి అమెరికా సహాయం.. సైనిక శక్తిని అందిస్తూ ఆపన్నహస్తం
Russia Ukraine War
Follow us

|

Updated on: Jul 02, 2022 | 4:17 PM

రష్యా (Russia) దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు మరోసారి ఆపన్నహస్తం అందించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు మరోసారి సహాయం అందిస్తూ ఉపశమనం కలిగించింది. ఉక్రెయిన్‌కు 820 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందజేయనున్నట్లు అగ్రరాజ్య అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ సైనిక శక్తిని బలపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సైనిక చర్య పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా దాడులు చేస్తోంది. ఫలితంగా ఉక్రెయిన్‌ ఆర్థికంగా, సైనిక పరంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు అమెరికా (America) అండగా నిలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 7 బిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందించింది. కాగా.. ఒడెసా తీర ప్రాంతమే లక్ష్యంగా శుక్రవారం రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని సెర్హివ్కా పట్టణంలో క్షిపణుల ధాటికి 21 మంది మృత్యువు పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో 38 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గతంలోనూ ఉక్రెయిన్ కు అమెరికా ఆర్థిక సహాయం అందించింది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను దీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి. కాగా.. 40 బిలియన్ డాలర్లను విడుదల చేస్తూ శనివారం ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేశారు. గతంలో కూడా ఇలాగే అమెరికా 13 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. యుద్ధం వల్ల దెబ్బతిన్న సాధారణ పరిపాలనను గాడిలో పెట్టేందుకు 8 బిలియన్ డాలర్లను వినియోగించనున్నారు.

యుద్దం ప్రారంభం అయినప్పుడు కొన్ని వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని రష్యా భావించింది. కానీ అమెరికా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలు సైనికంగా, వ్యూహాత్మక సహాయాన్ని అందించడంతో పోరులో ఉక్రెయిన్ గట్టిగా నిలుస్తోంది. అమెరికా వ్యూహాలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా స్వాధీనం చేసుకోకుండా నిలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..