
హైవేపై అర్థరాత్రి వేళ ఓ యువతి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ప్యార్ ఆ గయా రే పాటకు ఆమె చేసిన కొరియోగ్రఫీ, అద్భుతమైన డాన్స్ మూవ్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీసింది. ఇంతకీ వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆ యువతి అర్ధరాత్రి సమయంలో ఎలాంటి భయం లేకుండా, పూర్తి శక్తితో, ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ప్యార్ ఆ గయా రే పాటకు తగ్గట్టుగా ఆమె వేసిన స్టెప్పులు చాలామందిని ఆకట్టుకున్నాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఆమె ఏమాత్రం తడబడకుండా రీల్ కోసం పర్‌ఫార్మ్ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే లక్షలాది వీక్షణలు వేలాది కామెంట్లతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె డ్యాన్స్ టైమింగ్, కాన్ఫిడె, ఎక్స్‌ప్రెషన్లను మెచ్చుకుంటున్నారు. ఆమెలో మంచి నృత్య నైపుణ్యం ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అయితే మెజారిటీ నెటిజన్లు ఈ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో, వేగంగా వాహనాలు వెళ్లే హైవేలపై ఇలా నిలబడి డ్యాన్స్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చీకటిలో ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డుపై ఉన్నవారు సరిగ్గా కనిపించకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిసేపటి ప్రసిద్ధి లేదా కొన్ని లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి హైవేలు, రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేయడం ఇటీవల పెరిగిపోయింది. ఈ వీడియో కూడా అలాంటి భద్రతా పరమైన ప్రశ్నలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రతిభను నిరూపించుకోవడానికి సురక్షితమైన వేదికలను ఎంచుకోవాలని, రహదారులపై ఇలాంటి స్టంట్లు చేసి తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకూడదని నెటిజన్లు, నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..