కారు ధర కంటే రిపేర్ బిల్లే ఎక్కువ.. బెంగళూరు ఇంజనీర్‌కు రూ. 61 లక్షల బిల్లు వేసిన మెర్సిడెస్!

బెంగళూరులోని అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆదమ్ రిజ్క్ అనే వ్యక్తికి చెందిన మెర్సిడెస్ బెంచ్ కారు ఇటీవల డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతనికి ఏమీ కాకపోయినప్పటికీ, కారు బాగు చేయించడానికి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లగా అక్కడ వచ్చిన అంచనా బిల్లు చూసి అతను షాక్‌కు గురయ్యాడు. ఒక కొత్త కారు కంటే కూడా రిపేర్ బిల్లే ఎక్కువగా ఉండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కారు ధర కంటే రిపేర్ బిల్లే ఎక్కువ.. బెంగళూరు ఇంజనీర్‌కు రూ. 61 లక్షల బిల్లు వేసిన మెర్సిడెస్!
Mercedes Repair Bill

Updated on: Oct 24, 2026 | 9:20 AM

లగ్జరీ కార్లు కొనడమే కాదు.. వాటిని నిర్వహించడం, ప్రమాదం జరిగితే బాగు చేయించడం అంతకంటే ఖరీదైన వ్యవహారమని నిరూపించే సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆదమ్ రిజ్క్ అనే వ్యక్తికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రమాదం, షాకింగ్ బిల్లు:

ఇటీవల బెంగళూరు హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఆదమ్ రిజ్క్‌కు చెందిన మెర్సిడెస్ కారు ప్రమాదవశాత్తూ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి పెద్ద గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కానీ కారు కుడి వైపు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో కారును బాగు చేయించడానికి బెంగళూరులోని అధికారిక మెర్సిడెస్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కారును పరిశీలించిన సిబ్బంది ఇచ్చిన అంచనా బిల్లు చూసి ఆదమ్ రిజ్క్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

బిల్లు వివరాలు ఇలా ఉన్నాయి:

కారును బాగు చేయడానికి సర్వీస్ సెంటర్ ఏకంగా రూ. 61,70,077 (రూ. 61.7 లక్షలు) ఖర్చవుతుందని బిల్లు ఇచ్చింది. ఇందులో

కారు విడిభాగాల (Parts) ఛార్జీలు: రూ. 47,76,589

లేబర్ (కూలీ) ఛార్జీలు: రూ. 4,52,500

కేంద్ర, రాష్ట్ర జిఎస్‌టీ (CGST & SGST): సుమారు రూ. 9.41 లక్షలు

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన:

ఆదమ్ రిజ్క్ ఈ బిల్లు రసీదును ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. లగ్జరీ కారు కొనడం ఎంత కష్టమో, దాన్ని రిపేర్ చేయించడం అంతకంటే భారం అని ఒకరు కామెంట్ చేయగా, ఈ బిల్లు మొత్తంతో ఒక కొత్త లగ్జరీ కారునే కొనుగోలు చేయవచ్చు అని మరికొందరు అభిప్రాయపడ్డారు. బెంగళూరు ట్రాఫిక్, రోడ్లకు అంత ఖరీదైన కార్లు అవసరం లేదని, దానికి బదులు సాధారణ కార్లు వాడటమే శ్రేయస్కరమని మరికొందరు సలహా ఇచ్చారు. ఈ ఘటన లగ్జరీ కార్ల విడిభాగాల ధరలు, వాటి మెయింటెనెన్స్ ఖర్చులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us