Viral Video: కొబ్బరి చెట్టు ఎలా ఎక్కాలో నేర్పుతున్న కొండ చిలువ..! చూశారంటే షాకే..

|

Nov 15, 2021 | 4:38 PM

Python Climbs Tree: సోషల్‌ మీడియా ప్రపంచంలో రోజూ మనం అనేక వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని వైరల్‌ వీడియోలు చాలా ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులు,

Viral Video: కొబ్బరి చెట్టు ఎలా ఎక్కాలో నేర్పుతున్న కొండ చిలువ..! చూశారంటే షాకే..
Viral Video
Follow us on

Python Climbs Tree: సోషల్‌ మీడియా ప్రపంచంలో రోజూ మనం అనేక వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని వైరల్‌ వీడియోలు చాలా ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు పాతవే అయినా సరికొత్తగా ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. నెటిజన్లు వాటిని చూసి తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ భారీ కొండ చిలువ కొబ్బరిచెట్టు ఎక్కుతోంది. సాధారణంగా నేలమీద పాకేటప్పుడు కొండచిలువ… వంపులు తిరుగుతూ ముందుకుసాగుతుంది. కానీ కొబ్బరిచెట్టు ఎక్కేటప్పుడు మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ టైంలో అది భూమ్యాకర్షణ శక్తి ని లెక్కలోకి తీసుకుంటుంది. బల్లిలా ఎక్కేంత సీన్ కొండచిలువకు ఉండదు కాబట్టి… అది కొబ్బరి చెట్టును చుట్టూ చుట్టుకొని మెల్లమెల్లగా పైకి ఎక్కుతోంది. కొబ్బరిచెట్టును ఇలా ఎక్కితేనే పైకి వెళ్లగలను అని ఆ కొండచిలువ ఆలోచించడం గొప్ప విషయమే అని నెటిజన్లు కితాబిస్తున్నారు.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ ఇది ట్రెండింగ్ గా మరింది. తాజాగా ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో royal_pythons_ అకౌంట్‌లో షేర్ చేశారు. వేలసంఖ్యలో నెటిజన్లు వీక్షిస్తున్న ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొండచిలువ ఐడియా బహు గొప్పగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అచ్చం గౌడన్నలాగే.. ఓ ప్రణాళికతో కొండ చిలువ కొబ్బరి చెట్టును ఎక్కుతోందని.. పలువురు పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో.. 

Also Read:

TSRTC MD Sajjanar: పాటతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ డ్రైవ‌ర్.. సజ్జనార్ ట్వీట్ చేసి ఏమన్నారంటే..? వీడియో

Beauty Tips: ఐబ్రోస్‌ థ్రెడింగ్‌తో కలిగే నొప్పిని తట్టుకోలకపోతున్నారా.? ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..