Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! బురదలో ఆ బుర్ర పనితీరు చూస్తే నవ్వలేక పోట్టచెక్కలే..

ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షలకు పైగా వీక్షించగా, వేలాది మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు. లైక్ చేసి షేర్ చేశారు. ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్స్‌ బాక్స్‌ మొత్తం నింపేశారు. వామ్మో వీళ్లేం మనుషులు సామీ ఇలా ఉన్నారంటూ కామెంట్స్‌ చేశారు. మరొ వ్యక్తి అడుగుతున్నాడు.. తన కోసం కూడా ఒక జత ఇలాంటి చెప్పులు తయారు చేయించాలని కోరుతున్నాడు. కావాలంటే నేను డబ్బు పంపుతాను అంటూ పేర్కొన్నారు.

Viral Video: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! బురదలో ఆ బుర్ర పనితీరు చూస్తే నవ్వలేక పోట్టచెక్కలే..
Man Used His Amazing Brain

Updated on: Sep 16, 2025 | 12:02 PM

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. వాటిలో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తారు. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం నవ్వుతో పొట్ట పగిలియేంత ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియోలు చూసిన తర్వాత ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆ బాలుడు బురద నుండి తనను తాను రక్షించుకోవడానికి అద్భుతమైన జుగాడ్‌ను ప్రయత్నించాడు. నిజానికి, ఆ వ్యక్తి బురదలో నడవాల్సి రావడంతో తన మెదడుకు పదును పెట్టాడు. అద్భుతమైన ఆలోచన చేశాడు. తన కాళ్లకు ఇటుక చెప్పులు ధరించి బురద రోడ్డు దాటుతాడు. ఈ వీడియో @maximum_manthan అనే ఖాతా నుండి Instagramలో షేర్ చేయబడింది. “ఇకపై బురద పాదాలకు అంటుకోదు” అనే క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

ఇకపోతే, నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షలకు పైగా వీక్షించగా, వేలాది మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు. లైక్ చేసి షేర్ చేశారు. ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్స్‌ బాక్స్‌ మొత్తం నింపేశారు. వామ్మో వీళ్లేం మనుషులు సామీ ఇలా ఉన్నారంటూ కామెంట్స్‌ చేశారు. మరొ వ్యక్తి అడుగుతున్నాడు.. తన కోసం కూడా ఒక జత ఇలాంటి చెప్పులు తయారు చేయించాలని కోరుతున్నాడు. కావాలంటే నేను డబ్బు పంపుతాను అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఇలాంటి అతి తెలివైన వ్యక్తులు కూడా ఉంటారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..