Viral Video: వేసవి తాపం.. నీటి కోసం అల్లాడిన పక్షి.. వీడియో చూస్తే గుండె తరుక్కుపోతుంది

|

Apr 09, 2022 | 12:58 PM

సమ్మర్ వచ్చేసింది.. భానుడి భగభగలు మొదలయ్యాయి. క్రమక్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.

Viral Video: వేసవి తాపం.. నీటి కోసం అల్లాడిన పక్షి.. వీడియో చూస్తే గుండె తరుక్కుపోతుంది
Bird
Follow us on

సమ్మర్ వచ్చేసింది.. భానుడి భగభగలు మొదలయ్యాయి. క్రమక్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. వేసవి తాపానికి చిన్నపిల్లలు, వృద్దులు విలవిలలాడిపోతున్నారు. ఇక జంతువులు, పక్షుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.. నీడకోసం, దాహం తీర్చుకోవడానికి జంతువులు, పక్షులు అల్లాడిపోతున్నాయి. జంతువులు, పక్షులు నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఓ పక్షి నీటికోసం అల్లాడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గుండె ద్రవిస్తుంది. నీరు దొరక్క అపస్మారక స్థితిలోకి చేరిన పక్షిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ చిన్న పక్షి నీరు దొరక్క అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అది గమనించిన ఓ వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చి దాని నోటిని నీరు అందించాడు. బాటిల్ సహాయంతో ఆపక్షి దాహాన్ని తీర్చాడు అతడు. గొంతులోకి నీటి చుక్క జారడంతో పక్షికి తిరిగి శక్తి వచ్చింది. ఆ పక్షి వెంటనే  సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈవీడియో పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వేసవిలో జంతువులు , పక్షులకు నీరు పెడితే  వాటి ప్రాణాలు కాపాడినవారం అవుతాము. అందువలన ఇంట్లో లేదు మన పరిసర ప్రాంతాల్లో పక్షులకు నీరు పెట్టి వాటి ప్రాణాలు కాపాడుదాం..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Yami Gautam: ‘నన్ను దిగజార్చాలని చూస్తున్నారు, నా హృదయం ముక్కలయ్యింది’.. ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్‌ బ్యూటీ.

RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..

Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!