Viral Video: హృదయానికి హత్తుకుంటోన్న వీడియో.. ఉడతలతో ముచ్చట్లు..సాయం..

|

Jul 05, 2022 | 6:21 PM

సాయం చేయడం మనుషుల్లో ఉన్న గొప్ప గుణం. ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికి సాయం చేస్తూ ఉంటారు

Viral Video: హృదయానికి హత్తుకుంటోన్న వీడియో.. ఉడతలతో ముచ్చట్లు..సాయం..
Squirrels
Follow us on

Viral Video: సాయం చేయడం మనుషుల్లో ఉన్న గొప్ప గుణం. ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికి సాయం చేస్తూ ఉంటారు. తోటి మనుషులకే కాదు జంతువులకు కూడా సాయం చేస్తుంటారు కొందరు. జంతుప్రేమికులు మనుషులకన్నా జంతువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. జంతుజీవుల సంరక్షణ కొరకు ఎదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు కొందరు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతువుల్లో చూడగానే ముచ్చటగా అనిపించే వాటిలో ఉడత కూడా ఒకటి. ఉడుతలు స్నేహపూర్వక జంతువులలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి. ప్రజలు వీధుల్లో వారికి ఆహారం ఆనందిస్తారు, వాటిని ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తూ ఉంటారు కొందరు.

ఆర్కిటిక్ ప్రాంతాలు, కఠినమైన ఎడారులను మినహాయించిమిగిలిన అన్ని ప్రాంతాల్లోఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉడతలు  ఎక్కువగా విత్తనాలు, గింజలను తినే శాకాహార జంతువులు. అయితే వాటిలో కొన్ని కీటకాలు, చిన్న జంతువులను కూడా తింటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న ఉడతలకు నీరు తాగించడం చూడొచ్చు. ఒక వ్యక్తి నేలపై కూర్చుని సమీపంలోని ఉడుతకి నీరు తాగిస్తూ కనిపించాడు.  అలాగే అక్కడే ఉన్న మరో ఉడతతో మాట్లాడుతూ కెమెరా వైపు చూడమని చెప్పాడు. అయితే ఆది అతడి దగ్గరకు వెళ్లి ఆకలి అవుతుంది అన్నట్టుగా అతడిని చూస్తూ ఉండిపోయింది. వెంటనే అతడు దానికి గింజలను ఇస్తాడు. ఓ వైపు ఒక ఉడతకు నీరు తపిస్తూ.. మరో ఉడతకు ఆహరం అందించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీడియో హృదయానికి హత్తుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి