సోషల్ మీడయాలో రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. మరికొన్ని వీడియోలు చూస్తే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలను చాలామంది ఇష్టపడుతారు. ఏనుగులు,కోతులు, చిలుకలు, పులులు, సింహాలు, మొసళ్ల వీడియోలో నెటింట్లో చక్కరు కొడుతుంటాయి. జంతువులకు వాటి సంరక్షకులు ఆహారం పెట్టాడం, వాటితో చనువుగా ఉండడం వంటివి చూస్తే కొన్ని సందర్భాల్లో మనం షాక్ అవుతాం. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి మొసళ్ల వద్దకు వెళ్లి వాటి తోక లాగాడు. ఆ తర్వాత ఏం అయింది? ఆ వ్యక్తికి మొసలి ఏమైనా హాని చేసిందా?
ఆ వీడియోలో చెరువు వద్ధ మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి గట్టు మీద సేద తీరుతున్నాయి. అయితే ఓ వ్యక్తి మొసలి వేషంలో చెరువుకు వద్ద వచ్చాడు.చేతిలో కర్ర పట్టుకొని ఓ మొసలిని కొట్టే ప్రయత్నిం చేస్తాడు. ఆ మొసలి కూడా భయపడుకుండా అతడి మీదకు వస్తుంది. ఆ వ్యక్తి పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో ఈ మొసలి ఏదో తేడా ఉంది.. మనకు ఎందుకు లే అని ఆ మొసలి నీటిలోకి మెల్లగా జారుకుంటుంది . ఆ తర్వాత ఇంకో మొసలి వద్దకు వెళ్లిన వ్యక్తి దాని తోక పట్టుకొని గట్టిగా లాగుతాడు. దీంతో అది ఇదెదో మాయదారి మొసలిలా ఉంది అని నీటిలోకి వెళ్తుంది. మరో మొసలి కూడా మెల్లగా నీటిలోకి జారుకుంటుంది.
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. ఏం గుండెరా వాడింది ఆ గుండె బతకాలని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరెమో ముసలికే ముచ్చెమటలు పట్టిచావు కదరా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరు మనకెందుకు మావా ఇలాంటివి.. అవీ తిరిగి అటాక్ చేస్తే నీ పని ఖతమే అంటూ ఫన్నీగా రెస్పండ్ అవుతున్నారు.
— Nature Is Scary (@Nature1sScary) October 2, 2024