Viral Photo: మనిషన్నాక ప్రాణాల మీద కాస్త తీపి ఉండాలి.. నడిరోడ్డుపై ఈ డేంజర్ ఫీట్స్ ఏంటి నాయనా..

|

Jul 07, 2022 | 9:17 PM

వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లడం, ఓవర్ టెక్ చేయడం, వేగంగా వెళ్లడం లాంటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ప్రమాదాలు పెరుగుతున్నా..

Viral Photo: మనిషన్నాక ప్రాణాల మీద కాస్త తీపి ఉండాలి.. నడిరోడ్డుపై ఈ డేంజర్ ఫీట్స్ ఏంటి నాయనా..
Viral News
Follow us on

Man Daring Stunts With Cylinder On Bike: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కువగా నిర్లక్ష్యం కారణంగానే వాహన ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు అసలు కారణం. వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లడం, ఓవర్ టెక్ చేయడం, వేగంగా వెళ్లడం లాంటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ప్రమాదాలు పెరుగుతున్నా.. వీటిపై అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం అస్సలు పట్టించుకుండా మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణించడం, ఏవేవో వస్తువులను తీసుకోని గూడ్స్ వాహనంలా ద్విచక్రవాహనాన్ని ఉపయోగించడం లాంటి ఘటనలను మనం చాలానే చూసుంటాం.. తాజాగా అలాంటి ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా.. మరో వ్యక్తి వెనుక కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే మంచిగానే ఉండేది.. కానీ.. అతను వెనుక బైక్‌పై ఉన్న గ్యాస్ బండపై కూర్చొని ప్రయాణిస్తున్నాడు. ఇంకా ఫోన్ కూడా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వెనుకవైపు బ్యాగు.. ముందు ఒక బాక్సు కూడా ఉంది. నడిరోడ్డుపై ఈ డేంజర్ ప్రయాణం ఏంటంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలా వెళ్లడం వారికే కాదు.. రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి కూడా ప్రమాదమేనంటూ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

bike

కాగా.. ఈ ఫొటోను హైదరాబాద్ పోలీసులు షేర్ చేశారు. ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమని.. ఇలాంటి ఫీట్లను ఎప్పుడూ చెయొద్దంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు.