Viral Video: ఏంట్రా బాబు ఇలా ఉన్నావ్.. అదేమైనా పిల్లి అనుకున్నావా.. పెద్దపులితో పరాచకాలు..

|

Aug 29, 2024 | 11:27 AM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతాయి.. ఇవి చూడటానికి క్యూట్ గా ఉంటాయి.. అయితే.. సాదు జంతువులతో ఆడుకోవడం సహజమే..

Viral Video: ఏంట్రా బాబు ఇలా ఉన్నావ్.. అదేమైనా పిల్లి అనుకున్నావా.. పెద్దపులితో పరాచకాలు..
Viral Video
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతాయి.. ఇవి చూడటానికి క్యూట్ గా ఉంటాయి.. అయితే.. సాదు జంతువులతో ఆడుకోవడం సహజమే.. కానీ క్రూర జంతువులతో ఆడుకోవడం చూశారా..? అయితే.. సాధ్యమైనంత వరకు అలాంటి సహాసం ఎవ్వరూ చేయరు.. ఎందుకంటే.. అవి హాని తలపెట్టే ప్రమాదం ఉంటుంది.. అందుకే.. ఎవ్వరూ వాటి జోలికి పోరు.. అయితే.. ఓ యువకుడు ఏకంగా పులితో ఆటలాడుకోవడం సంచలనంగా మారింది.. అవును.. మేం చెప్పేది నిజమే.. తాజాగా.. ఓ యువకుడు పులితో సరదాగా ఆటలాడుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది.. దీన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.. అది పిల్లి పిల్ల మాదిరిగా.. యువకుడు పులితో సరదాగా ఆటలాడుతూ నిమురుతూ కనిపించడం సంచలనంగా మారింది.. దీన్ని చూసి ఏంట్రా నాయనా.. చూస్తుంటేనే భయం వేస్తుంది.. అంటూ నెటిజన్లు షేక్ అవుతున్నారు..

పెద్దపులి ఒడిలో పడుకోని ఉండగా.. ఓ వ్యక్తి దాని పొట్ట భాగంలో నిమురుతూ.. దానికి చక్కిలిగింతలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఇక్కడ కనిపించే వ్యక్తి చాలా ప్రశాంతంగా.. పులిని ఒడిలో పడుకోబెట్టుకుని.. పొట్ట భాగంలో నిమరడం, చక్కిలిగింతలు పెడుతూ కనిపిస్తున్నాడు.. అయితే, సాధారణంగా జంతువులు పొట్ట భాగాన్ని ముట్టుకోనివ్వవు.. అక్కడ చేయి వేస్తే హానికలిగిస్తారేమోనన్న భయంతో.. దాడి చేస్తాయి.. కానీ.. ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం పులితో ఎంజాయ్ చేయడం అద్భుతమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్.. లో ‘AMAZlNGNATURE’ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు.. ఈ పోస్ట్‌కి “బెల్లీ రబ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి లక్షలాది మంది వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మనిషి.. పులి బంధం చూసి షాక్ అయ్యామని.. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.. పులి పిల్లి మాదిరిగా ఎంజాయ్ చేస్తుందంటూ అభివర్ణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..