జంతువులల్లో అత్యంత గంభీరమైన, శక్తివంతమైన జీవులలో పులులు కూడా ఒక్కటి.. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని ఒక వ్యక్తి గొలుసుతో ఉన్న పులిని గుర్రంలా స్వారీ చేస్తున్నాడు. డిజిటల్ సృష్టికర్త నౌమన్ హసన్ పోస్ట్ చేసిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తుఫానుగా మారింది. ఈ వీడియో కొద్ది రోజుల్లోనే లక్షకు పైగా ఫ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో, ఆ వ్యక్తి ఒక పెద్ద పులిపై కూర్చుని, మామూలుగా దానిని బహిరంగ ప్రదేశంలో స్వారీ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో రెండు బోనులు ఉన్నట్లు తెలుస్తుంది. బోనులు సింహం ఉన్నాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా తప్పు అని, పులులు బొమ్మలు కాదని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి గంభీరమైన జంతువును వినోదం కోసం బంధించవద్దని పేర్కొంటున్నారు. పేదపులి చాలా నిస్సహాయంగా కనిపిస్తోందని, ఇద జంతు హింస అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పులి క్షేమంగా ఉందా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కూడా చట్టబద్ధమైనదేనా? ఇలాంటివి జరిగినప్పుడు అధికారులు ఎక్కడ ఉన్నారు? వీరికి చట్టం వర్తంచదా అని మరికొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.