Viral Video: హైనాపై సింహాల మూకుమ్మడి దాడి.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది

సింహం.. అడవికి రాజన్న విషయం తెలిసిందే. సింహం గర్జన వినపడితేనే మిగతా జంతువులు ఆ ఏరియాలో లేకుండా పరుగులు పెడతాయి.

Viral Video: హైనాపై సింహాల మూకుమ్మడి దాడి.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది
Lion Hunts Hyna

Updated on: Oct 24, 2021 | 7:05 PM

సింహం.. అడవికి రాజన్న విషయం తెలిసిందే. సింహం గర్జన వినపడితేనే మిగతా జంతువులు ఆ ఏరియాలో లేకుండా పరుగులు పెడతాయి. తన పదునైన పంజాతో బలమైన జంతువులను సైతం ఆహారంగా మార్చుకోగల సత్తా సింహానికి ఉంది. ఏ మాత్రం దయలేని జంతువు కూడా సింహానికి పేరుంది. ఇక హైనా కూడా క్రూరమైన జంతువే. పరిస్థితులను బట్టి మందగా లేదా సింగిల్‌గా.. ఇవి ఇతర జీవులపై దాడి చేస్తాయి. చూడటానికి హైనా చాలా క్రూరంగా ఉంటుంది. తాజాగా సింహాలు హైనాని వేటాడుతోన్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్రెండ్ అవుతోన్న వీడియోలో, హైనా అనుకోకుండా సింహాలు ఉన్న ప్రాంతానికి వచ్చింది. అది కనిపించిన వెంటనే, సింహాలు దానిపై దాడి చేశాయి. హైనా అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.  సింహం బారి నుండి బయటపడటం అంత సులభమైన విషయం కాదన్న విషయం తెలిసిందే. మందంగా ఉండటంతో సింహాలు పెద్దగా ఆరాటపడలేదు. సింపుల్‌లా ఓ సింహం హైనాను నోటకరిచి పక్కకు తీసుకెళ్లింది. ప్రాణ భీతితో హైనా గట్టిగా కేకలు వేసినప్పటికీ.. దయలేని సింహాలు ఆ అరుపులను పెద్దగా పట్టించుకోలేదు.

వీడియో దిగువన వీక్షించండి

 

ఈ షాకింగ్ వీడియోను @iftirass అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి భారీగా లైక్స్, షేర్స్ వస్తున్నాయి. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతూ ఈ జంతువులు వేటకు సంబంధించిన వీడియోను సర్కులేట్ చేస్తున్నారు.

Also Read: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

 

Follow Us