Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..

Viral Video: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల బాధలు మాటల్లో చెప్పలేనివి. కనీసం నడవడానికి సరైన రోడ్డు ఉండదు. ఆస్పత్రులకు వెళ్లాలన్నా నడిచే వెళ్లాలి.

Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..
Jawan

Updated on: Apr 22, 2022 | 7:30 AM

Viral Video: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల బాధలు మాటల్లో చెప్పలేనివి. కనీసం నడవడానికి సరైన రోడ్డు ఉండదు. ఆస్పత్రులకు వెళ్లాలన్నా నడిచే వెళ్లాలి. ఎవరికైనా ప్రాణం మీదకు వచ్చినప్పుడు.. వారి పడే యాతన మామూలుగా ఉండదు. మరీ ముఖ్యంగా ప్రసవం సమయంలో గర్భిణీలను మంచంపై పడుకోబెట్టి దాంతోపాటు మోసుకెళ్తుంటారు. ఇక తాజా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని మంచంపై పడుకోబెట్టుకోని ఆస్పత్రికి మోసుకెళ్తున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేశాడు ఓ జవాన్‌.

చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ ఫ్యామిలీకి, జిల్లా రిజర్వ్ గార్డ్ ఫోర్స్ జవాన్ వారికి సహాయం చేశారు. గ్రామస్థులతో కలిసి ఆయన దంతేవాడలో ఉన్న ఆస్పత్రికి చేరుకోవడానికి ఒక గర్భిణీని మంచం మీద మోసుకెళ్లారు. గ్రామంలోని అడవి బాటలో ప్రయాణిస్తూ అనేక కిలోమీటర్లు మోసుకుని తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు వైద్యం అందేలా చేశారు.

Also read:

Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!

Telangana: గుజరాత్‌కు రూ.21 వేల కోట్లు, మరి తెలంగాణకేవి?.. కేంద్రంపై ఫైర్ అయిన వినోద్ కుమార్..

TTD: శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు..

Loading...
Unable to load recommendations.
Follow Us