షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

బయట అత్యంత చౌకగా జీడిపప్పు ఎక్కడ అమ్ముతారు? జీడిపప్పు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. అయితే, అవి చాలా ఖరీదైనవి కాబట్టి అందరూ వాటిని కొనలేరు. కానీ బహుశా మీకు తెలియకపోవచ్చు, మన దేశంలో ఒక నగరం ఉంది. అక్కడ మీరు టమోటాలు, ఉల్లిపాయల ధరకే అంటే కిలో రూ. 50 నుండి 100 రూపాయలకే ఒక బస్తా నిండా జీడిపప్పు కొనవచ్చు. అది ఎక్కడో తెలిస్తే..

షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?
Cashew production in Jharkhand

Updated on: May 09, 2026 | 7:57 AM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ప్రధానమైనది. మెగ్నీషియం, జింక్, మంచి కొవ్వులు కలిగిన జీడిపప్పును రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే, మార్కెట్లో దీని ధర కిలో రూ. 800 దాటడంతో సామాన్యులు దీనిని కొనడానికి వెనకాడుతుంటారు. కానీ, మన దేశంలోనే ఒక చోట మాత్రం టమాటా, ఉల్లిపాయల ధరకే జీడిపప్పు లభిస్తుందని మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని భారతదేశపు జీడిపప్పు నగరం అని కూడా పిలుస్తారు. అది మరెక్కడో కాదు.. జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తారా జిల్లా ఈ అద్భుతానికి వేదిక. ఈ ప్రాంతం ఒకప్పుడు సైబర్ నేరాలకు వార్తల్లో నిలిచేది. కానీ, ఇప్పుడు దేశంలోనే అత్యంత చౌకగా జీడిపప్పు లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నాల (Nala) అనే గ్రామంలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో జీడిపప్పు తోటలు ఉన్నాయి.

జామ్‌తారాలో జీడిపప్పు ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది. ఏటా వేల టన్నుల జీడిపప్పు ఇక్కడ పండుతుంది. అయితే, ఇక్కడ పండించిన జీడిపప్పును శుద్ధి చేసే (Processing) పరిశ్రమలు లేదా ప్లాంట్లు స్థానికంగా అందుబాటులో లేవు. పంటను నిల్వ చేసే సదుపాయం లేకపోవడంతో, రైతులు పచ్చి జీడిపప్పును అతి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మినట్లుగా ఇక్కడ జీడిపప్పును అమ్ముతుంటారు. ఇక్కడ పచ్చి జీడిపప్పు కిలో రూ. 50 నుండి రూ. 60 వరకు లభిస్తుండగా, ప్రాసెస్ చేసిన పప్పు రూ. 150 నుండి రూ. 200 లకే దొరుకుతుంది.

మీరు ఎప్పుడైనా జార్ఖండ్ పర్యటనకు వెళ్తే, జామ్‌తారా నుండి తక్కువ ధరకే జీడిపప్పును తెచ్చుకోవచ్చు. దీన్ని ఎండబెట్టి భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా వాడుకోవచ్చు. పండుగల సమయంలో బంధువులకు, స్నేహితులకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఇది ఉత్తమమైన మార్గం. తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత కలిగిన జీడిపప్పు లభించడం వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us