Viral News: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కారు డ్రైవర్.. ఊహించని బిగ్ ట్విస్ట్.. అసలేంటంటే.!

|

Jul 05, 2021 | 5:06 PM

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. కేరళ నుంచి అబుదాబి వెళ్లి.. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తోన్న రెంజిత్ అనే..

Viral News: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కారు డ్రైవర్.. ఊహించని బిగ్ ట్విస్ట్.. అసలేంటంటే.!
Money
Follow us on

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. కేరళ నుంచి అబుదాబి వెళ్లి.. దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తోన్న రెంజిత్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. జూలై 3న తీసిన బిగ్ టికెట్ డ్రాలో భారత్‌కు చెందిన కారు డ్రైవర్ రెంజిత్ సోమరాజన్‌ 20 మిలియన్ దిర్హమ్స్ అంటే..మన ఇండియన్‌ కరెన్సీలో అక్షరాల రూ. 40.57 కోట్లు గెలుచుకున్నాడు. జూన్ 29న తొమ్మిది మంది స్నేహితులతో కలిసి సోమరాజన్ కొన్న లాటరీ టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది.

ఇంత పెద్ద మొత్తంలో లాటరీ తగులుతుందని ఊహించలేదన్నాడు రెంజిత్. తానేప్పుడూ కూడా సెకండ్‌ లేదా థర్డ్‌ ప్రైజ్‌ బహుమతి కోసం ఆశపడేవాడినని చెప్పుకొచ్చాడు. దుబాయ్‌లో 2008 నుంచి వివిధ కంపెనీల్లో పని చేశానని,. ప్రస్తుతం టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు చెప్పాడు. లాటరీలో వచ్చిన ప్రైజ్‌ మనీని 9 మంది సహచరులతో కలిసి పంచుకోనున్నట్టు తెలిపాడు.

Also Read: 

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!