Viral Photo: మీకు సవాళ్లంటే ఇష్టమా..? అయితే ఈ ఫోటోలో దాగున్న పామును కనిపెట్టండి

|

Apr 06, 2022 | 2:19 PM

పజిల్స్ ఎవరికి ఇష్టముండవు. అందరికీ ఇష్టమే. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. వీటిపై నెటిజన్లు విపరీతంగా ఆకర్షితులవుతారు..

Viral Photo: మీకు సవాళ్లంటే ఇష్టమా..? అయితే ఈ ఫోటోలో దాగున్న పామును కనిపెట్టండి
Fine The Snake
Follow us on

Snake Trending Photo: బోర్ కొట్టిందంటే చాలు.. అందరూ  సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. అక్కడ ఫన్ కోసం, టైమ్ పాస్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ ఉంటుంది. మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్. ఇవి  మీ కళ్లలో ఎంత పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఈ ఫోటో పజిల్స్‌ను కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా అందిస్తున్నాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా, మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. తెగ తికమక పెడుతూ మనతో ఒక ఆట ఆడుకుంటాయ్.  ఇవి చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి. కాగా ఫోటో పజిల్స్ సాల్వ్ చేస్తే ఓ కిక్ వస్తుంది. తాజాగా ఓ పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం అడవిలో తీసినదిగా కనిపిస్తుంది. అందులో  ఓ పాము దాగుంది. అక్కడున్న చెట్ల కొమ్మల్లో అది ఉంది. దీన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. 100కు 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేస్తే.. మీరు తోపు అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దిగువ ఫోటోను చూసేయ్యండి. అక్కడ మీకు పాము ఎక్కడ ఉందో క్లియర్‌గా రౌండ్ చేసి ఇచ్చాము.

Also Read:  AP: వ్యాన్ బోల్తా.. పరుగులు తీసిన డ్రైవర్.. పోలీసులు తికమక.. స్పాట్‌లో చెక్ చేయగా