Viral Photo: ఈ ఫోటోలో ఓ బల్లి దాగుంది..కనిపెడితే మీరు గ్రేటే.. ట్రై చేయండి

|

Jan 12, 2022 | 10:08 AM

ప్రజంట్ సోషల్ మీడియా హవా ఏ రేంజ్ లో నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రజంట్ జనరేషన్ అన్ని అవసరాలకు సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతుంది.

Viral Photo: ఈ ఫోటోలో ఓ బల్లి దాగుంది..కనిపెడితే మీరు గ్రేటే.. ట్రై చేయండి
Find The Lizard
Follow us on

ప్రజంట్ సోషల్ మీడియా హవా ఏ రేంజ్ లో నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రజంట్ జనరేషన్ అన్ని అవసరాలకు సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతుంది. బోలెడంత ఎంటర్టైన్మెంట్ అక్కడే దొరకుతుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్స్ కోసం ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని లెక్క తేలేవరకు వదిలిపెట్టరు. పజిల్స్ వాస్తవంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందిస్తాయి. మెదడుకు యాక్టివ్ గా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే అనుకోకండి. ఫోటో పజిల్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’.. ‘ఈ ఫోటోలో ఉన్న జంతువును కనిపెట్టండి’.. లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం కొంచెం కష్టమే.  ముఖ్యంగా మీ చూపుల్లో పవర్ ఉండాది. బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని రివర్స్ గేమ్ ఆడేసుకుంటాయి. చాలా సమయం స్పెండ్ చేసినా కూడా సాల్వ్ అవ్వకుండా పరీక్ష పెడతాయి. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. అదో రకమైన సంతృప్తిగా ఉంటుంది.  అయితే ఫోటో పజిల్స్‌ను అందించేందుకు ఇప్పుడు సోషల్ మీడియా పేజెస్ కూడా పనిచేస్తున్నాయ్. సదరు పేజీలకు లైక్ చేస్తే చాలు ఎఫ్.బి, ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఎన్నో ఫోటో ఫజిల్స్ మీ ముందు ఉంటాయ్.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ  ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ బల్లి దాగుంది. అక్కడి మట్టి రంగులో అది ఇమిడిపోయింది.  దాన్ని కనిపెట్టడం అంత సులువు మాత్రం కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫోటోలోని బల్లిని కొద్ది సెకన్లలోనే కనిపెట్టారంటే మీకు మంచి పవర్ ఉందనే చెప్పాలి. మీ చూపుల్లో ఎంత పదును ఉందో తెలియాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Also Read: శుభముహూర్తం లేదంటూ 10 సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య.. కోర్టుకెక్కిన భర్త, చివరకు