
బ్రిటన్ రాణి దివంగత ఎలిజబెత్ II చిన్నతనంలో తన చేతితో రాసిన ఒక లేఖ ఇటీవల వేలంలో 25,000 పౌండ్లకు (సుమారు 3 మిలియన్ రూపాయలు) అమ్ముడైంది. నివేదిక ప్రకారం, ఆమె 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ ఉత్తరం రాసిందని తెలిసింది. యుకెలోని కెంట్‌లోని హాన్సన్స్ ఆక్షనర్స్‌లో ఈ వేలం జరిగింది. ఈ లేఖ అంచనా వేసిన ధర కంటే చాలా రెట్లు అధిక ధరకు అమ్ముడయిందని, ఈ చారిత్రాత్మక పత్రాన్ని చర్చనీయాంశంగా మార్చిందని తెలుస్తోంది. జంతువుల పట్ల ప్రేమ, సిబ్బంది పట్ల ఔదార్యం ఈ లేఖలో స్పష్టం తెలుస్తోంది. 1936 -1940 ఈ లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. విండ్సర్‌లోని రాయల్ లాడ్జ్‌లో ప్రధాన గృహిణి బీట్రైస్ స్టిల్‌మన్‌ను ఉద్దేశించి వ్రాయబడింది. రాయల్ హౌస్‌హోల్డ్‌లో ఉన్న రాయల్ లాడ్జ్ రాజ కుటుంబానికి నివాసంగా ఉంది. ఆ లేఖలో చిన్న ఎలిజబెత్ రాణి ఇలా రాసింది,..పక్షులు బాగున్నాయని, గోల్డ్ ఫిష్ చనిపోలేదని నేను ఆశిస్తున్నాను. ఆమె స్టిల్‌మన్‌ను తాను ఎంచుకున్న ప్రింరోజ్‌లను మిగిలిన సిబ్బందితో పంచుకోవాలని కూడా కోరింది. ఆ లేఖలో కుక్కలు, గుర్రాలు, పిల్లల డూడుల్‌లు కూడా ఉన్నాయి. ఇది ఆమె బాల్య అమాయకత్వాన్ని, జంతువుల పట్ల ప్రేమను ప్రతిబింబిస్తుంది.
అప్పటి ఒక పాత సూట్‌కేస్‌లో దొరికిన అమూల్యమైన నిధి ఈ లేఖ. 2024లో బీట్రైస్ స్టిల్‌మన్ మేనకోడలు జీన్ వెస్టాకాట్ మరణించిన తర్వాత ఆమె మంచం కింద ఉన్న సూట్‌కేస్‌లో ఈ లేఖను గుర్తించారు. జీన్ మేనల్లుడు విలియం వెస్టాకాట్ దీనిని అద్భుతమైన క్షణంగా అభివర్ణించారు. వేలాన్ని సమన్వయం చేసిన జస్టిన్ మాథ్యూస్ మాట్లాడుతూ, ఈ లేఖ రాణి బాల్యం, ఆమె కరుణా స్వభావాన్ని కళ్లకు కట్టినట్టు తెలిసేలా చేస్తుందన్నారు. క్వీన్ ఎలిజబెత్‌ను కుక్కలు, గుర్రాలను ప్రేమించే వ్యక్తిగా మనం గుర్తుంచుకున్నట్లే, ఈ చిన్ననాటి లేఖలో కూడా అదే ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది అని ఆయన అన్నారు. ప్రిన్సెస్ మార్గరెట్ నుండి ఒక నోట్ కూడా ఉంది. ఆ లేఖలో ప్రిన్సెస్ మార్గరెట్ రాసిన ఒక చిన్న నోట్ కూడా ఉంది. ఆమె ఇలా రాసింది, బీట్రైస్! దయచేసి నా స్విమ్మింగ్ సూట్ చూసుకుంటావా? – మార్గరెట్. వేలంపాటదారుడి ప్రకారం, ఎలిజబెత్ లేఖ జంతువులు, సిబ్బంది పట్ల ఆమెకున్న ఆందోళనను ప్రతిబింబిస్తుండగా, మార్గరెట్ నోట్ ఫ్యాషన్, వ్యక్తిగత వస్తువులపై ఆమెకున్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది. రెండూ ఆమె తరువాతి వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉన్నాయి.
Remember this letter/picture by Queen Elizabeth II? It sold at auction for 25k
by
u/Nuthetes in
UKmonarchs ఇవి కూడా చదవండి
ఈ లేఖ ఎందుకు ప్రత్యేకమైనది?
ఆ కాలంలో పిల్లలు ఇంటి సిబ్బందితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం సర్వసాధారణమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వారు వారి పట్ల అభిమానంతో ఉండేవారని కూడా ఈ లేఖ తెలియజేస్తుంది. అయితే, కాబోయే రాణి రాసిన ఈ లేఖ భావోద్వేగభరితమైనది మాత్రమే కాదు, చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఇది చిన్నప్పటి నుండి ఎలిజబెత్ ప్రేమ, బాధ్యత, జంతు ప్రేమగల స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఆ లక్షణాలు తరువాత ఆమె సుదీర్ఘమైన, విజయవంతమైన పాలనలో ప్రతిబింబిస్తాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..