Viral Video: ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర హీటెక్కుతోంది.. వీడియో

|

Feb 27, 2022 | 8:59 AM

Golgappa Shake Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పలు రకాల వినూత్న రకాల వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Viral Video: ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర హీటెక్కుతోంది.. వీడియో
Golgappa Shake Viral Video
Follow us on

Golgappa Shake Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పలు రకాల వినూత్న రకాల వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్ క్రీం ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ (Trending) అవుతోంది. ఇది చూసి ‘పానీపూరీ’ ప్రియులు వామ్మో ఇదేంటిరా నాయనా..? అంటూ తలబాదుకుంటున్నారు. ఆ విచిత్ర వంటకం ఎంటంటే.. ‘గోల్గప్పా షేక్’ (పానీపూరి షేక్). ఇది చూస్తే తయారు చేయడం ఈజీ అనుకుంటారు. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచి ఎలా ఉంటుందనేది ట్రై చేస్తేనే తెలుస్తుంది. కానీ.. ఈ విచిత్ర షేక్ చూసి వాంతులు అవుతున్నాయంటూ నెటిజన్లు ఇంటర్నెట్ వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా..? నాయనా.. ఇలా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ క్లిప్‌లో ఓ వ్యక్తి ‘గోల్గప్ప షేక్’ తయారు చేస్తున్నాడు. మొదట అతను మిక్సర్‌లో రెండు గొల్గప్పను వేస్తాడు. తరువాత కొన్ని ఉడికించిన బంగాళాదుంపలు, రెడ్ చట్నీ, పుల్లని నీరు కలుపుతాడు. దీని తరువాత కొద్దిగా ఐస్ జోడించి.. మిక్సర్ ఆన్ చేస్తాడు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసులో పోసి.. గొల్గప్ప పొడిని వేస్తాడు. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలతో అలంకరించి ఇస్తాడు.

వీడియో..

ఈ వీడియోను Instagramలో foodie_blest హ్యాండిల్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తేనే వాంతులు వస్తున్నాయంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: మాస్క్ పెట్టుకోవాలంటే ఇంత కష్టపడాలా?.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో.

Challan Payment: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్