Throwback Pic: ఈ ఫోటోలోని వరల్డ్ ఫేమస్ జంటను గుర్తుపట్టారా? ఈజీగా చెప్పేయెచ్చు..

|

Nov 06, 2021 | 11:44 AM

కొందరి సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన నాయకుడు...

Throwback Pic: ఈ ఫోటోలోని వరల్డ్ ఫేమస్ జంటను గుర్తుపట్టారా? ఈజీగా చెప్పేయెచ్చు..
Throwbac Pic
Follow us on

కొందరి సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ పెళ్లినాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను జార్జి బుష్ స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం విశేషం. జార్జి బుష్, ఆయన సతీమణి లారా బుష్ శుక్రవారంనాడు తమ 44వ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లినాటి  ఫోటోను జార్జి బుష్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. జార్జి బుష్, లారా బుష్ ఇద్దరూ కలిసి వెడ్డింగ్ కేక్ కట్ చేస్తున్న ఫోటో ఇది. 1977 నవంబర్ 5న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

నవంబర్ మాసం తమ ఇంట్లో చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. నవంబరు 4న తన సతీమణి లారా బుష్ జన్మదినం కాగా.. మరుసటి రోజు నవంబరు 5 తమ పెళ్లి రోజుగా గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదికగా లారా బుష్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.

జార్జి బుష్ షేర్ చేసిన తమ పెళ్లి ఫోటో..

తమ పెంపుడు శునకం, భార్య లారా బుష్‌తో జార్జి డబ్ల్యూ బుష్..

తమ మనవరాలితో జార్జి బుష్, లారా బుష్..

Also Read..

Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి

Viral News: గ్యాస్‌ సిలిండర్లు స్థూపకారంలోనే ఎందుకు ఉంటాయి.? చతురస్రాకారంలో ఎందుకుండవు.? కారణమేంటంటే..