మందు బాబులకు గుడ్ న్యూస్.. అక్కడ డ్రింక్ ఫ్రీ! కానీ ఒక చిన్న కండిషన్.. అదేంటో తెలుసా?

సాధారణంగా బార్‌కి వెళ్తే జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ ఈ బార్‌కి వెళ్తే మాత్రం మీకు ఉచితంగా మద్యం లభిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జపాన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ బార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటి? ఉచితంగా మందు ఎలా ఇస్తున్నారు? తెలుసుకుందాం పదండి.

మందు బాబులకు గుడ్ న్యూస్.. అక్కడ డ్రింక్ ఫ్రీ! కానీ ఒక చిన్న కండిషన్.. అదేంటో తెలుసా?
Career Advice Bar Japan

Edited By:

Updated on: Feb 05, 2026 | 4:16 PM

జపాన్‌లోని టోక్యోలో కెరీర్ కౌన్సెలింగ్ బార్ అనే వెరైటీ కాన్సెప్ట్ మొదలైంది. ఇక్కడ బార్ టెండర్లు కేవలం పెగ్గులు కలపడమే కాదు.. మీ కెరీర్‌ను కూడా సెట్ చేస్తారు. అవును మీరు విన్నది నిజమే.. ఈ బార్‌లో పని చేసే బార్ టెండర్లు ప్రొఫెషనల్ కెరీర్ కన్సల్టెంట్స్. అయితే ఈ ఉచిత మద్యం ఆఫర్ అందరికీ కాదు. కేవలం ఉద్యోగ వేటలో ఉన్న యువతకు మాత్రమే.

మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఈ బార్‌కి వెళ్లి అక్కడి బార్ టెండర్లతో మీ కెరీర్ గోల్స్ గురించి చర్చించవచ్చు. మీ రెజ్యూమే ఎలా ఉండాలి? ఇంటర్వ్యూలలో ఎలా సమాధానాలు చెప్పాలి? ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వంటి విషయాలపై వారు మీకు సలహాలు ఇస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నందుకు బదులుగా మీకు నచ్చిన డ్రింక్ ఉచితంగా అందిస్తారు.

ప్రస్తుతం జపాన్‌లోని యువత కెరీర్ విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆఫీస్ వాతావరణం, ఇంటర్వ్యూల భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటువంటి వారికి కాస్త రిలాక్సేషన్ ఇస్తూనే.. సరైన మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న బార్‌ను ప్రారంభించారు. ఒక గ్లాసు డ్రింక్ తీసుకుంటూ మనసు విప్పి మాట్లాడితే, అభద్రతాభావం తగ్గి ఆలోచనలు స్పష్టంగా వస్తాయని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వైరల్..

ఉద్యోగం కోసం తిరుగుతూ విసిగిపోయిన యువతకు ఈ బార్ ఒక వరంలా కనిపిస్తోంది. బార్ టెండర్లే మెంటర్లుగా మారి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం అనే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన దేశంలో కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అంటూ తెలుగు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.