Fact Check: ఒక పక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో పక్క ఒమిక్రాన్ పేరుతో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒమిక్రాన్ కు సంబంధించిన సినిమా ఒకటి 1963లో వచ్చినట్టుగా ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. ఆ పోస్టర్ మీద ‘ది ఓమిక్రాన్ వేరియంట్’ అనే టైటిల్ ఉంది. దీనిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ ”నమ్మండి..నమ్మకపోండి.. ఈ చిత్రం ఈ చిత్రం 1963లో వచ్చింది, దీని ట్యాగ్‌లైన్ చూడండి.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. అంతేకాకుండా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఈ పోస్టర్ విపరీతంగా షేర్ అవుతూ వస్తోంది.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఇదీ..
Believe it or faint ..This film came In 1963 ..Check the tagline ??? pic.twitter.com/ntwCEcPMnN
— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2021
ఈ పోస్టర్ గురించి శోధించినపుడు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఈ పోస్టర్ కి ఆ పేరుతో ఉన్న సినిమాకీ సంబంధం లేదని తేలింది. అసలు అటువంటి సినిమా ఏదీ లేదనే విషయం తెలిసింది.
అసలు పోస్టర్ ఇదీ..
వైరల్‌గా మారిన పోస్టర్‌లో నిజమెంతో తెలుసుకునేందుకు గూగుల్‌లో వైరల్‌గా మారిన పోస్టర్‌ని రివర్స్ సెర్చ్ చేసినపుడు abandomoviez , E-bay , todocoleccion అనే వెబ్‌సైట్‌లో దాని అసలు పోస్టర్ కనిపించింది. abandomoviez వెబ్‌సైట్‌లో కనిపించే చిత్రం అసలైన పోస్టర్‌లో, ఇది స్పానిష్ భాషలో ఉన్న టైటిల్ అది ఇలా ఉంది.” sucesos en la IV” అంటే నాల్గవ దశలో ప్రోగ్రామ్. ఇక స్పానిష్ చలనచిత్రం sucesos en la IV దశ అసలైన కవర్ టోడోకోలెసియన్ అనే ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఈ కవర్ ధర 12 యూరోలు. అదేవిధంగా ఈ స్పానిష్ సినిమా ముఖచిత్రం ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఇ-బేలో కూడా అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఈ కవర్ ధర 10 డాలర్లు.
మార్చిన పోస్టర్ ఇదీ..
IMDb వెబ్‌సైట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా దొరికింది. వెబ్‌సైట్ ప్రకారం, ఇది సెప్టెంబర్ 1974లో విడుదలైన కల్పిత చిత్రం. ఇందులో ఎడారి చీమలు, మనుషుల మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. ఆ చీమలతో పోరాడి ప్రజలను రక్షించే ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక అమ్మాయి ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.
వెబ్‌సైట్‌లో స్పానిష్ సినిమా ఒరిజినల్ పోస్టర్ చూడగానే వైరల్ అయిన పోస్టర్ ఎడిట్ అంటే ఫేక్ అని తెలిసింది.
Omicron అనే చిత్రానికి సంబంధించిన కీలక పదాలను Googleలో శోధిస్తే IMDb వెబ్‌సైట్‌లో Omicron చలన చిత్రం పూర్తి సమాచారం లభించింది. మీరు కూడా ఈ విధంగా సెర్చ్ చేసి చూడండి. ఈ వెబ్‌సైట్ ప్రకారం..
‘ది ఓమిక్రాన్ వేరియంట్’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమా పోస్టర్ ఎడిట్ చేసింది అంటే ఫేక్ అని స్పష్టం అవుతోంది.
ఇవి కూడా చదవండి: Omicron Confusion: ప్రపంచ నిపుణులను తికమక పెడుతున్న ఒమిక్రాన్.. ఈ వేరియంట్ ప్రభావంపై విభిన్నఅంచనాలు.. మూడో వేవ్ తప్పదా?