ICMR DG: ఎంతకాలం పని చేస్తుందనేది తెలియదు.. కొవిడ్ వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎంఆర్ డీజీ..

|

Jan 04, 2021 | 7:31 AM

ICMR DG: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా భారత ఔషధ నియంత్ర మండలి ఆదివారం నాడు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను అత్యవసర..

ICMR DG: ఎంతకాలం పని చేస్తుందనేది తెలియదు.. కొవిడ్ వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీఎంఆర్ డీజీ..
Follow us on

ICMR DG: దేశంలో కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా భారత ఔషధ నియంత్ర మండలి ఆదివారం నాడు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లను అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సినేషన్‌పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డీజీ బలరామ్ భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్‌లు ఎంతకాలం ప్రభావం చూపుతాయనేది అంశంపై క్లారిటీ లేదన్నారు. భవిష్యత్‌లో మాస్క్‌లు ధరించే అవసరం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంపై మీడియాతో మాట్లాడిన భార్గవ.. ‘దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తామనే విషయంలో క్లారిటీ లేదు. ఆ వ్యాక్సిన్ ఎంతకాలం పని చేస్తుందో కూడా తెలియదు. కానీ కరోనా నివారణ చర్యలు పాటిస్తూ ఆ మహమ్మారిని దేశంలో వ్యాప్తి చెందకుండా చేయగలం అనే నమ్మకం మాత్రం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్ టీకా, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కింద వ్యక్తులకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతు ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ టీకా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆ మేరకు వ్యాక్సినేషన్‌కు కోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ టీకాను ముందుగా కరోనా వారియర్స్‌కు వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Also read:

Tomar Meets Rajnath: కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన వ్యవసాయ శాఖ మంత్రి… రైతులతో చర్చల నేపథ్యంలో…

U.K. Variant Virus: మొన్నటి దాకా కరోనా… ఇప్పుడు యూకే కొత్త వైరస్… ఎన్ని దేశాలకు పాకిందో తెలుసా..?