Viral Video: చేపను చంపబోయిన మహిళ.. వద్దంటూ అడ్డుపడిన కుక్క.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే?

|

Jun 05, 2022 | 7:18 AM

ఈ వీడియో nikitaaa_08_ పేరుతో Instagramలో పంచుకున్నారు. నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఈ వార్త రాసే వరకు ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చేపను చంపబోయిన మహిళ.. వద్దంటూ అడ్డుపడిన కుక్క.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే?
Dog Viral Video
Follow us on

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించిన మిలియన్ల కొద్దీ చిత్రాలు, వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజ్లు చాలా ఇష్టపడుతుంటారు. జంతువులకు సంబంధించిన కంటెంట్ (Animal Viral Video) ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించే కంటెంట్‌లో ఒకటిగా నిలిచింది. జంతువులకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అదే సమయంలో, మానవుల నుంచి ఏదో ఒకటి నేర్చుకునే జంతువులు, కొన్నిసార్లు మానవులకు మానవత్వాన్ని కూడా బోధిస్తుంటాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇలాంటివి మనం చూస్తున్నాం. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

కుక్క ఎదురుగా చేప కనిపిస్తే, దానిని చంపి తింటుందని మనకు తెలసిందే. కానీ ఈ వీడియోలో పరిస్థితిని చూస్తే మాత్రం.. ఎవరైనా తన మనసు మార్చుకుంటారోమేనని అనిపిస్తుంది. ఓ మహిళ చేపలను చంపేందుకు రెడీ అవుతుంది. అయితే, పక్కనే ఉన్న కుక్క ఆమె చేయి పట్టుకుని అలా చేయవద్దని కోరుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో nikitaaa_08_ పేరుతో Instagramలో పంచుకున్నారు. నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ఈ వార్త రాసే వరకు ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్‌లను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..