knowledge: రైలు పట్టాలు వర్షంలో తడిచినా ఎందుకు తుప్పు పట్టవో తెలుసా.? లాజిక్‌ ఏంటంటే..

|

Jan 26, 2023 | 7:11 PM

రైల్వే వ్యవస్థలో పట్టాలది కీలక పాత్ర అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ట్రాక్‌ల ఆధారంగానే రైళ్లు నడుస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 67,000 కి.మీల మేర రైల్వే ట్రాక్‌ విస్తరించి ఉంది. అయితే రైల్వే ట్రాకులు ఎండకు ఎండుతాయి, వర్షానికి తడుస్తాయి. కాలంతో సంబంధం లేకుండా అన్నింటిని తట్టుకుంటాయి...

knowledge: రైలు పట్టాలు వర్షంలో తడిచినా ఎందుకు తుప్పు పట్టవో తెలుసా.? లాజిక్‌ ఏంటంటే..
Railway Tracks
Follow us on

రైల్వే వ్యవస్థలో పట్టాలది కీలక పాత్ర అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ట్రాక్‌ల ఆధారంగానే రైళ్లు నడుస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 67,000 కి.మీల మేర రైల్వే ట్రాక్‌ విస్తరించి ఉంది. అయితే రైల్వే ట్రాకులు ఎండకు ఎండుతాయి, వర్షానికి తడుస్తాయి. కాలంతో సంబంధం లేకుండా అన్నింటిని తట్టుకుంటాయి. సాధారణంగా రైల్వే ట్రాకులు ఇనుముతో తయారు చేస్తారని మనం భావిస్తుంటాం. వర్షంలో తడిసినా రైల్వే ట్రాక్‌లు ఎందుకు తుప్పు పట్టవనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా.? ట్రాక్‌ చుట్టూ తప్పు పట్టినా పై భాగంలో మాత్రం ఎప్పుడూ తుప్ప పట్టదు. ఇంతకీ రైల్వే ట్రాక్‌పై ఎందుకు తుప్ప పట్టదు? దీని వెనకాల ఉన్న అసలు లాజిక్‌ ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇనుముతో తయారైన ఏ వస్తువైనా గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపినప్పుడు తుప్పు పడుతుంది. ఇనుముపై ఏర్పడే తుప్పు వల్ల ఐరన్‌ ఆక్సైడ్‌ పొర ఏర్పడుతుంది. అయితే రైల్వే ట్రాకులు తుప్ప పట్టకపోవడానికి.. వీటిని ప్రత్యేక రకం ఉక్కుతో తయారు చేస్తారు. దీనిని మాంగనీస్ స్టీల్ అంటారు. ఇందులో 12% మాంగనీస్, 0.8% కార్బన్ ఉంటుంది. రైల్వే ట్రాక్‌ నిర్మాణాల్లో ఈ లోహాలు ఉండటం వల్ల దానిపై ఐరన్ ఆక్సైడ్ ఏర్పడదు.

ఈ కారణంగానే ట్రాక్‌లపై తుప్పు పట్టదు. ఒకవేళ రైల్వే ట్రాక్‌లను సాధారణ ఇనుముతో తయారు చేస్తే వర్షం, గాలిలోని తేమ కారణంగా తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ట్రాక్‌లు బలహీనంగా మారి రైళ్లు ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ట్రాక్‌లను మాంగనీస్‌ స్టీల్‌తో తయారు చేస్తారు. ఇది తప్పు పట్టదు, ఎక్కువ కాలం బలంగా ఉంటుంది. ఇదండీ రైల్వే ట్రాక్‌ల నిర్మాణంలో ఉన్న అసలు లాజిక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..