Save Water: మీ పాట్నర్‌తో స్నానం చేయండి.. నీటిని ఆదా చేయండి.. ఆ దేశంలో సరికొత్త నీటి పొదుపు పథకం

|

Apr 16, 2024 | 9:36 PM

బొగోటా నగరంలోని ప్రజలకు సరికొత్త నీటి పొదుపు పధకం గురించి నగర్ మేజర్ ఫెర్నాండో గాలన్‌ చెప్పారు. అది “మీ భాగస్వామితో స్నానం చేసి నీటిని పొదుపు చేసుకోండి” అనే సలహాను ఇస్తున్నారు. అంతేకాదు సెలవు రోజుల్లో స్నానం చేయకుండా నీటిని ఆదా చేయమంటూ పిలుపునిచ్చారు. ఇంకా అందనంగా నీటి పొదుపు కోసం స్థానిక మీడియా నివేదికల ప్రకారం నెలకు 22 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించే గృహాల నుంచి అదనపు రుసుము వసూలు చేయబడుతుంది.

Save Water: మీ పాట్నర్‌తో స్నానం చేయండి.. నీటిని ఆదా చేయండి.. ఆ దేశంలో సరికొత్త నీటి పొదుపు పథకం
Bath With Your Patner And Save Water
Follow us on

వేసవి కాలం వచ్చేసింది. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేదు.. ప్రతి చోటా నీటి సమస్య పెరుగుతోంది. ఈ నీటి సమస్య అనేది ఒక్క మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సేవ్ వాటర్ పేరుతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. తాజాగా కొలంబియాలోని ఓ నగరంలో కొత్త చట్టం తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ చట్టం నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

కొలంబియాలోని బొగోటా నగరంలో నీటిని తక్కువగా ఉపయోగించమని చెబుతూ.. కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. బొగోటా మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ కొత్త నీటి వినియోగ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇపుడు ఈ చట్టం సర్వత్రా వైరల్‌గా మారింది. అవును, బొగోటా నగరంలోని ప్రజలకు సరికొత్త నీటి పొదుపు పధకం గురించి నగర్ మేజర్ ఫెర్నాండో గాలన్‌ చెప్పారు. అది “మీ భాగస్వామితో స్నానం చేసి నీటిని పొదుపు చేసుకోండి” అనే సలహాను ఇస్తున్నారు. అంతేకాదు సెలవు రోజుల్లో స్నానం చేయకుండా నీటిని ఆదా చేయమంటూ పిలుపునిచ్చారు.

ఇంకా అందనంగా నీటి పొదుపు కోసం స్థానిక మీడియా నివేదికల ప్రకారం నెలకు 22 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించే గృహాల నుంచి అదనపు రుసుము వసూలు చేయబడుతుంది. బొగోటా మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ మాట్లాడుతూ ఎవరైనా తమ కార్లను నీటితో శుభ్రం చేసుకోవడం లేదా నీటి వృధాగా భావించే ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తే అటువంటి వ్యక్తులకు 300 డాలర్లను జరిమానాగా విధిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే సాధారణంగా రోజూ వాష్ చేసే సిటీ బస్సులను ఇకపై వారానికి ఒకసారి మాత్రమే వాష్ చేసేలా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. బొగోటా నగర ప్రధాన నీటి వనరు అయిన చింగాజా రిజర్వాయర్‌లో ప్రస్తుతం 15% మాత్రమే నీరు నిల్వ ఉంది. మరో రెండు నెలల్లో వర్షాలు కురవకపోతే రిజర్వాయర్‌లో నీరు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..