చైనాలో వింత ట్రెండ్: పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?

సాధారణంగా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. కానీ చైనాలోని జెన్-జీ యువత మాత్రం ఆ బొమ్మలనే తమ పిల్లలుగా భావిస్తున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. సాఫ్ట్ టాయ్స్ లేదా స్టఫ్డ్ టాయ్స్‌ను కేవలం అలంకార వస్తువులుగా చూడకుండా వాటికి స్నానాలు చేయిస్తూ, డ్రెస్సులు మారుస్తూ, రెస్టారెంట్లకు తీసుకెళ్తూ అసలైన తల్లిదండ్రుల బాధ్యతను పోషిస్తున్నారు.

చైనాలో వింత ట్రెండ్: పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
China's Youth Treat Stuffed Toys As Kids

Edited By:

Updated on: Feb 14, 2026 | 4:18 PM

చైనాలో ప్రస్తుతం ఈ స్టఫ్డ్ టాయ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. యువత తమ దగ్గర ఉన్న టెడ్డీ బేర్లు లేదా ఇతర సాఫ్ట్ బొమ్మలకు పేర్లు పెట్టి వాటితో ముచ్చట్లు చెబుతున్నారు. ఈ బొమ్మల కోసం ప్రత్యేకంగా క్లీనింగ్ సెంటర్లు, స్పా సెంటర్లు కూడా వెలిశాయి. అక్కడ బొమ్మల కళ్లు తుడవడం, వాటి జుట్టును సరిచేయడం వంటి పనులు చేస్తారు. యువత హోటళ్లకు వెళ్లేటప్పుడు ఈ బొమ్మలను కూడా వెంట తీసుకెళ్తున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయించి వాటి ముందు ఫుడ్ పెట్టి ఫోటోలు దిగుతున్నారు.

ఈ వింత అలవాటు వెనుక ఒక బలమైన కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో విపరీతమైన పని ఒత్తిడి, పోటీ ప్రపంచం వల్ల యువత తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ బొమ్మలు వారికి ఎమోషనల్ సపోర్ట్‌ను ఇస్తున్నాయని వారు నమ్ముతున్నారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే అయ్యే ఖర్చు కంటే ఈ బొమ్మలను సాకడం చాలా సులభమని.. పైగా ఇవి ఎప్పటికీ తమను వదిలి వెళ్లవని యువత భావిస్తున్నారు. ఈ బొమ్మలు ఎటువంటి కండిషన్లు పెట్టవు, గొడవ పడవు. కేవలం తమ మాటలను వింటూ నిశ్శబ్దంగా తోడుంటాయి కాబట్టే వీటిపై ప్రేమ పెంచుకుంటున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xiaohongshu అనే చైనా ఇన్‌స్టాగ్రామ్ లో వేల సంఖ్యలో యువకులు తమ బొమ్మ పిల్లలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. దీనిని కొందరు వింతగా చూస్తున్నా.. మరికొందరు మాత్రం ఇది మానసిక ప్రశాంతత కోసం చేస్తున్న ప్రయత్నమని సమర్థిస్తున్నారు. మొత్తానికి మారుతున్న కాలంతో పాటు మనుషుల ఎమోషన్స్ కూడా వింత వింత దారులు వెతుక్కుంటున్నాయని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us