
పిల్లలు ఏదైనా చూస్తే అది చేయాలని చూస్తారు. కొందరు టీవీల్లో పాటలు విని పాట పడతారు. కొందరు డ్యాన్స్ చూసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఓ పిల్లోడు పక్షిని చూసి దానిలా ఎగరలనుకున్నాడు. మరి అతను నిజంగానే పక్షి లాగే ఎగిరాడా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పేదవారు నివసించడానికి గుడిసె వేసుకుంటారు. ఈ గుడిసెలకు తాటి కమ్మలతో పై కప్పు కప్పుతారు. ఇలా ఓ పిల్లాడు తాటి కమ్మలను రెండు చేతులకు కట్టుకున్నాడు. ఆ కమ్మలతో గుడిసె పై నుంచి నేల పైకి దూకాలని అనుకున్నాడు. దూకుతున్నప్పుడు అతను పక్షిలా గాలిలో ఎగరాలనుకున్నాడు. అలా పై నుంచి కింద దూకాడు. ఆ సమయంలో కొంత మంది కుటుంబ సభ్యులు బాలుడితో ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోను ఐఏఎస్ అశ్విన్ శరణ్ తన అధికారిక ఖాతాలో పస్ట్ చేశారు. “ఇది ఆశ.. అది మిమ్మల్ని ఎగిరేలా చేస్తుంది” అని రాశారు. ఈ వీడియో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో చాలా వ్యూస్ వస్తున్నాయి. చాలా మంది నువ్వు ఎగరగలవు..ఇది నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ.. నువ్వు బాగా చదివి, డబ్బు సంపాదిస్తే విమానాల్లో ఎగరొచ్చు అని కామెంట్ చేశారు.
Read Also.. Viral Video: రజనీకాంత్ స్టైల్లో ఏదో డిఫెరంట్గా చేద్దామనుకున్నాడు.. పాపం మరేదో అయ్యింది.. వైరల్ వీడియో