చెన్నై మెరీనా బీచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన అద్భుతమైన వైమానిక ప్రదర్శనను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. అయితే డీహైడ్రేషన్ కారణంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 50 మంది ఆసుపత్రి పాలవడంతో ఈ కార్యక్రమం తీవ్ర విషాదం నింపింది. ఈ కార్యక్రమాన్నికి తమిళనాడు ప్రభుత్వం తగ్గిన ఏర్పాట్లు చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు.
చెన్నై రైలు స్టేషన్‌లోని రైళ్లల్లో జనం కిక్కిరేసి ఉన్నారు. అధికారులు వైమానిక ప్రదర్శనకు సరిగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ చూసిన ట్రాఫిక్ జామే దర్శినమించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రాక్‌లపై వేలాడుతూ వెళ్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక క్లిప్‌లో ప్రయాణీకులను రైలు డోర్, కిటికీలకి వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. దీనిపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని, కనీసం ఏర్పాట్లు కూడా చేయకపోవడం ఏంటి అని తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షమయ్యారు. అయినప్పటికీ, ప్రదర్శన ముగియడంతో, ఈ గుంపు ఏకకాలంలో బయటకు రావడానికి ప్రయత్నించింది. దీంతో రోడ్లపై, మెట్రో స్టేషన్లలో గందరగోళానికి దారితీసింది. రైల్వే స్టేషన్లలో రైళ్లు బోగీల గేటు వరకు ప్రయాణికులతో నిండిపోయాయి.
🚨 More than three people died and 100 were hospitalized at the Indian Air Force’s air show conducted at Chennai’s Marina Beach. pic.twitter.com/ZlmgPbIaOj
— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024