Viral Video: వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు రోజురోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి.. ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ వీడియోలు త్వరగా వైరల్ అవుతాయి. అలాంటి వీడియోలలో మీరు కొన్నిసార్లు జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం , లేదా వైరం మరిచి స్నేహంగా ఉండటం మనం చూడొచ్చు. ఇప్పుడు అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల వేటకు సంబంధించిన వీఐఓలు చాలానే మనం చూసి ఉంటాం. ఈ వీడియో కూడా చిరుత వేటకు సంబంధించినదే.. ఇందులో జింకను వేటాడేందుకు ప్రయతించింది ఓ చిరుత.
అయితే భూమిపై అత్యంత వేగంగాపరిగేతే చిరుత నుంచి తప్పించుకోవడం ఊహకు అందని విషయం. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్యప్రాణులకు సంబంధించిన ఈ వీడియోలో అడవిలో ఒక చిరుత జింకను వెంబడించింది. జింక తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత వేగంగా పరుగులు పెట్టింది. ఎంత వేగంగా పరిగెత్తిన చిరుత మాత్రం జింకను వదలలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ జింక చాలా ప్రయత్నించింది. చివరకు జింక వేగం తగ్గిపోవడంతోచిరుతకు చిక్కింది. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియో వండర్డిక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. చీతా ఫాలోయింగ్ మన్ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన కొందరు ‘రష్యా-ఉక్రెయిన్’ అంటూ పోల్చుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :