Viral Video: మనం ఎలాంటి క్రేజీ ప్రపంచంలో ఉన్నామో తెలుసా..ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..

సోషల్‌ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే మరికొన్ని ఫన్నీగా....

Viral Video: మనం ఎలాంటి క్రేజీ ప్రపంచంలో ఉన్నామో తెలుసా..ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..
Cctv Footage

Updated on: Oct 22, 2021 | 1:21 PM

సోషల్‌ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. బ్రెజిల్‌ దేశంలోని ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో ఒకేసారి మూడు వేర్వేరు ఘటనలు రికార్డవ్వడం నెటిజన్లను షాకింగ్‌కు గురిచేస్తోంది. పిల్లిని పట్టుకోవడానికి కుక్క వేగంగా పరిగెత్తడం…భార్య నుంచి తప్పించుకోవడానికి భర్త దూరంగా పారిపోవడం….దొంగను వెంబడిస్తోన్న పోలీసులు….ఇలా ఈ మూడు వేర్వేరు ఘటనలు ఒకేసారి సీసీటీవీలో రికార్డవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న ఓ నెటిజన్‌ ‘ నమ్మలేకున్నా ఇది నిజం. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. అతడు చెప్పినట్లే ఈ వీడియోను ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అందుకే ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Also read :

Viral video: మణికే మాగె హితే పాటకు మహిళ డ్యాన్స్‌….సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు..

Bike video viral: వాటే ఐడియా బైక్‌ రైడర్స్‌.. ఒక్కబైక్‌పై ఆరుగురు రైడ్‌.! వైరల్ గా మారిన వీడియో..

Viral Video: పాపం.. రజనీ స్టైల్లో చేద్దామనుకున్నాడు.. చివరికి ముఖం పగిలింది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో