Viral Video: ఈ ఎద్దు చేసిన ఫీట్ చూస్తే నిజంగా మీ మైండ్ బ్లాంక్ అవుతుంది…

|

Sep 28, 2021 | 6:32 PM

సూపర్ పవర్స్ ఉన్న మనుషులు మనకు చాలా అరుదుగా తారసపడుతుంటారు. వారి విన్యాసాలను చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం.

Viral Video: ఈ ఎద్దు చేసిన ఫీట్ చూస్తే నిజంగా మీ మైండ్ బ్లాంక్ అవుతుంది...
Bull Super Skill
Follow us on

సూపర్ పవర్స్ ఉన్న మనుషులు మనకు చాలా అరుదుగా తారసపడుతుంటారు. వారి విన్యాసాలను చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇదెలా సాధ్యం అనుకుంటాం. దాని వెనుక చాలా ప్రాక్టీస్, టెక్నిక్స్ ఉంటాయి. కానీ సూపర్ పవర్ ఉన్న జంతువులను ఎవరూ చూసి ఉండరు. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. మనుషులకు అంటే ఏదైనా కళను నేర్చుకోడానికి 100 ఆప్షన్స్ ఉంటాయి. ట్రైనర్స్ ఉంటారు. యూట్యూబ్ ఉంటుంది. ఇంక రకరకాల వేదికలు ఉంటాయి. కానీ ఈ ఎద్దుకు అవేం తెలియదు. కానీ అది చేసిన జంప్ చూస్తే మీరు నివ్వెరపోతారు. కనీసం అది ఇలా చేయగలదని మీరు ఊహించలేరు కూడా. కావాలంటే ఆ  వీడియోను మీరే దిగువన చూడండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో చాలా ఎద్దులను ఒక వృత్తంలో బంధించారు. అవి ఎక్కడికి వెళ్లకుండా చుట్టూరా ఒక స్ట్రాంగ్‌ గోడను నిర్మించారు. ఆ గోడ హైట్ చాలా ఎక్కువగా ఉంది. ద్వారం తెరిసినప్పుడు బయటకు వెళ్లడం, రావడం తప్ప.. మరో ఛాన్స్ అనేది లేదు. కానీ ఓ ఎద్దు మాత్రం సడన్‌గా ఓ క్రేజీ జంప్ ద్వారా లోనికి ఎంట్రీ ఇచ్చింది. ఎద్దు ఇంత అద్భుతమైన శైలిలో దూకడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. అదే సమయంలో, చాలా మంది దీనిపై తమ  మార్క్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హెప్గుల్ 5’ అనే అకౌంట్‌తో షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. వీడియోలో ఎద్దు చూపిన ఫీట్ చాలా అరుదుగా కనిపిస్తుందని ఒక యూజర్ రాసుకొచ్చారు.

Also Read:  ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’… వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్

కడుపులో కవలలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వెంటాడిన విషాదం.. ఆ కుటుంబంలో తీవ్ర దు:ఖం