Viral Video: పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన వధువు.. వరుడి ముఖం చూసి ఒకటే ఏడుపు.. అసలు కారణం తెలిస్తే

|

Jul 25, 2024 | 11:53 AM

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో వీడియో చూసిన ఒకరు ఈ వధువుకు చాలా పెద్ద కష్టమే వచ్చిందంటూ కామెంట్‌ చేయగా, మరికొందరు..నిశ్చితార్థ సమయంలో చూడకుండానే ఎలా అంగీకరించినట్లు అని అడుగుతున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం 800కు పైగా లైక్‌లు, వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన వధువు.. వరుడి ముఖం చూసి ఒకటే ఏడుపు.. అసలు కారణం తెలిస్తే
Bride Started Crying
Follow us on

పెళ్లంటేనే హడావుడి, హంగామా. పెళ్లి పనులు మొదలు పెట్టగానే.. ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగిపోతుంటారు. ఇక పెళ్లి వేడుకలో ఎన్నో వింతలు, విచిత్ర కార్యక్రమాలు, ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కోరికతో కొందరు వివిధ రకాలుగా పెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటిదే వెడ్డింగ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కల్యాణ మండపంలో పెళ్లికొడుకు పక్కనే ఉన్న పెళ్లి కూతురు ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ ఆమెను ఓదార్చారు. చివరకు కారణమేంటని విచారణంగా అసలు విషయం బయటపడింది.

వైరల్‌ వీడియోలో ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వధూవరుల వరమాల కార్యక్రమం ముగిసింది. ఇద్దరూ వేదికపై సోఫాలో కూర్చుని ఉన్నారు.. బంధువులు, స్నేహితులు, పెళ్లి వచ్చన వారంతా ఎవరి హడావుడిలో వారున్నారు. కొందరు వధూవరులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు.. ఈ క్రమంలో ముసుగు తీసిన వధువు.. వరుడి ముఖం వైపు చూసింది..ఇక అంతే.. తన ముఖానికి చేతులు పెట్టుకుని ఏడుపు గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. వధువుకు ఏం జరిగిందో తెలియక షాక్ అయిపోయారు.

ఇవి కూడా చదవండి

ఏం జరిగిందోనని వధువు వద్దకు చేరుకుని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.. స్నేహితులంతా చుట్టూ చేరి ఆమెను ఓదార్చుతున్నా.. వధువు మాత్రం ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుపు చూసి వరుడు మౌనంగా అలాగే ఉండిపోయాడు. ఇంతకీ ఆమె ఏడుపుకు కారణంగా ఏంటా అని ఆరా తీయగా, పెళ్లి కొడుకు రంగు అని తెలిసింది. వివాహ వేడుకలో వరుడిని చూసిన వధువు.. అతను నల్లగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయిందట. అందుకే బోరున ఏడ్చేసింది.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో వీడియో చూసిన ఒకరు ఈ వధువుకు చాలా పెద్ద కష్టమే వచ్చిందంటూ కామెంట్‌ చేయగా, మరికొందరు..నిశ్చితార్థ సమయంలో చూడకుండానే ఎలా అంగీకరించినట్లు అని అడుగుతున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం 800కు పైగా లైక్‌లు, వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..