Viral Video: భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్

|

Aug 13, 2021 | 3:51 PM

వ్యాయామం చెయ్యాలంటే సెపరేట్ డ్రస్ కోడ్ ఉండాల్సిందే. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. నార్మల్ దుస్తుల్లో కసరత్తులు..

Viral Video: భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో వధువు పుషప్స్.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్
Bride Push Ups Video
Follow us on

వ్యాయామం చెయ్యాలంటే సెపరేట్ డ్రస్ కోడ్ ఉండాల్సిందే. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. నార్మల్ దుస్తుల్లో కసరత్తులు చెయ్యడం చాలా అన్‌కంపర్ట్‌బుల్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఓ నవవధువు మాత్రం భారీ లెహంగాతో, ఒంటి నిండా నగలతో పుషప్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎరుపు రంగు లెహంగా ధరించి, భారీ ఆభరణాలతో ఆమె పుషప్స్ తీస్తుండగా.. పక్కన ఉన్నవారు ఆమెకు మస్త్ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. వైరల్ క్లిప్‌లో ఉన్న మహిళ పేరు అనా అరోరా. ఆమె ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. జిమ్ ట్రైనర్ కూడా. ఆమె జిమ్ సెషన్స్ వీడియోలను వివరణాత్మకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన వీడియోలు ఒక లెక్క.. ఈ పుషప్స్ వీడియో ఓ లెక్క. పెళ్లి లెహంగాలో సైతం ఆమె అథ్లెటిక్ దుస్తుల్లో ఉన్నట్లు కూల్‌గా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పుషప్స్ తీసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా సర్కులేట్ అవుతంది. ఈ రీల్ వీడియోకు ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్‌లోనే 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆమె ఫిట్‌నెస్ స్థాయిని చూసి చాలా మంది మెస్మరైజ్ అవుతున్నారు. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రమే కాకుండా తమ మార్క్ కామెంట్స్ పెడుతున్నారు.  పెళ్లి రోజున భారీ లెహంగాలో వాష్‌రూమ్‌‌కు వెళ్లేందుకు కూడా చాలామంది ఇబ్బంది పడతారని, ఈమె మాత్రం అలవోకగా పుషప్స్ తీయడం ఆశ్చర్యపరిచిందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

వీడియో దిగువన వీక్షించండి…

Also Read: బాయ్‌ఫ్రెండ్ కోసం యువతుల ఫైట్… నడి రోడ్డు కాస్తా బాక్సింగ్ రింగ్ అయిపోయింది

‘వెలుగు’ వాట్సాప్ గ్రూపులో పోర్న్ వీడియో కలకలం.. అసలు ఏం జరిగిందంటే..?