Brain Teaser Puzzle: మీ కళ్లకు పరీక్ష.. 20 సెకన్లలో ఈ ఫొటోలో తేడాను గమనిస్తే.. మీరే తోపు..

|

Aug 13, 2022 | 6:15 AM

ఇక్కడ కనిపిస్తున్న తిమింగలాల ఫొటోను జాగ్రత్తగా గమనించండి. కేవలం 10 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫొటోపై ఫోకస్ చేస్తే క్షణాల్లోనే తేడాను గుర్తించేయవచ్చు.

Brain Teaser Puzzle: మీ కళ్లకు పరీక్ష.. 20 సెకన్లలో ఈ ఫొటోలో తేడాను గమనిస్తే.. మీరే తోపు..
Brain Teaser Puzzle
Follow us on

Brain Teaser Puzzle: ప్రస్తుతం చిక్కు ప్రశ్నలు, సరదా గేమ్స్, పజిల్స్ ఆడేందుకు చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి గేమ్స్ మనలోని సృజనాత్మక ఆలోచనను వెలుగులోకి తీసుకొస్తాయి. ఈ తికమకపెట్టే పజిల్స్, చిక్కులను పరిష్కరిస్తున్న సమయంలో సమస్యను మరో కోణం నుంచి చూడడం, సులభంగా సరిచేయడం జరుగుతుంది. దీంతో మెదడు మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటోస్, పజిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదడుకు ఫుల్ పని చెప్పే ఓ పజిల్ ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. ఈ ఫొటోలో ఒక చిన్న తప్పు ఉంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.. 20 సెకన్లలోపు ఈ ఫొటోలోని వేరుగా ఉన్న వేల్‌ని కనుగొంటే మీరు చాలా గ్రేట్ అనొచ్చు. మీరు జాగ్రత్తగా గమనించి ఈ పజిల్‌ని పరిష్కరించవచ్చు. వేరుగా ఉన్న వేల్‌ని కనుగొని, ఈ బ్రెయిన్ టీజర్‌ను 20 సెకన్లలోపు పరిష్కరించగలరమో ఓసారి ట్రై చేయండి.

ముందుగా ఈ పజిల్ ఏమిటో చూద్దాం..

ఇవి కూడా చదవండి

పైన కనిపిస్తున్న వేల్స్ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. కేవలం 20 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫొటోపై ఫోకస్ పెడితే తేడాను ఈజీగా గుర్తిస్తారు. గమనించండి. తిమింగలాల ఫొటోలో 4 అడ్డు వరుసలు, 8 నిలువు వరుసలు ఉన్నాయి. 20 సెకన్లలోపు వేరుగా ఉన్న తిమింగలాన్ని కనుగొనడానికి మీరు అన్ని అడ్డు వరుసలు, నిలువు వరుసలను త్వరగా చూడాలి.

గమనించారా ? రెండో అడ్డు వరుస.. ఐదవ నిలువ వరుసలో మొదటి నుంచి ఐదవ తిమింగలాన్ని జాగ్రత్తగా గమనించండి. అది చాలా వేరుగా ఉంది కదూ. అదన్నమాట సంగతి. మరి మీరు ఈ క్లూస్ లేకుండా గమనిస్తే, మీకు చాలా ఐ పవర్ ఉన్నట్లే. కాగా, ఇలాంటి పజిల్స్‌కు తప్పనిసరిగా గణిత నైపుణ్యాలు, పార్శ్వ ఆలోచనలు అవసరం లేదనిపిస్తుంది. కేవలం సమస్యను క్షుణ్మంగా, ధీర్ఘంగా ఆలోచించడం మాత్రమే కావాల్సి ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..