Viral Video: నువ్వే రియల్‌ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?

సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణంగా నీటిలో అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువైన మొసలి కనిపిస్తే ఎవరైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తారు. కానీ, ఈ వీడియోలో ఒక రైతు మాత్రం మొసలిని చిన్న పిల్లాడిలా భుజాన వేసుకుని రోడ్డుపై హాయిగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: నువ్వే రియల్‌ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?
Bihar Farmer Crocodile

Updated on: Aug 04, 2026 | 12:36 PM

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో బీహార్‌కు చెందినదిగా తెలిసింది. బీహార్‌లోని సుపౌల్ జిల్లా లాల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుపౌల్ జిల్లా లాల్‌పూర్ గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే రైతు తన వరి పొలంలో పనిచేసుకుంటుండగా హఠాత్తుగా సుమారు ఐదు అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. వర్షాకాలంలో కోసి నది నీటిమట్టం పెరగడం వల్ల ఈ మొసలి పొలాల్లోకి కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. పొలంలో మొసలిని చూసి తోటి రైతులు మొదట భయాందోళనకు గురయ్యారు.

భయపడి పారిపోకుండా అమిత్ కుమార్ ధైర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. మొసలి దాడి చేయకుండా ఉండేందుకు గ్రామస్థుల సాయంతో దాని నోటిని తాడుతో గట్టిగా బంధించాడు. అనంతరం ఫారెస్ట్ ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో, ఏమాత్రం భయం లేకుండా ఆ ఐదడుగుల మొసలిని తన భుజాలపై వేసుకుని నేరుగా సమీపంలోని భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు.

ఇవి కూడా చదవండి

రోడ్డుపై ఒక వ్యక్తి భుజంపై మొసలిని ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తుంటే దారిన పోయే వాహనదారులు, గ్రామస్థులు షాక్ తిన్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఆ వీడియోలు నెట్టింట క్షణాల్లో వైరల్ అయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి..

రైతు పోలీస్ స్టేషన్‌కు మొసలితో రావడం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వారు వెంటనే అటవీ శాఖ అధికారు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మొసలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అది ఆరోగ్యంగా ఉండటంతో దాన్ని స్వాధీనం చేసుకుని సురక్షితంగా కోసి నదిలో విడిచిపెట్టారు. రైతు ధైర్యాన్ని అటవీ అధికారులు అభినందించినప్పటికీ, ప్రమాదకరమైన వన్యప్రాణులను సొంతంగా పట్టుకోవద్దని, వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us