హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్రం ఎంట్రీ.. భద్రత కోసం 40 మంది బౌన్సర్లు.. ధర తెలిస్తే షాకే!

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత పుష్కర్ పశు మేళా 2026లో ఓ తెల్లటి గుర్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేక్రీ ప్రాంతానికి చెందిన రాహుల్ జేత్వాల్ తన బాదల్ అనే గుర్రాన్ని డోలు వాయిద్యాలు, ఏకంగా 40 మంది బౌన్సర్ల కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజసంగా మేళాలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యజమాని నోట్ల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 5.5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న బాదల్‌తో పాటు న్యూ బాదల్, విశ్వాస్ అనే మరో రెండు గుర్రాలను కూడా ఆయన ప్రదర్శనకు ఉంచారు. ఈ మూడు గుర్రాల మొత్తం విలువ రూ. 5 కోట్ల పైమాటే కావడం విశేషం.

హీరోలకు ఏమాత్రం తీసిపోని గుర్రం ఎంట్రీ.. భద్రత కోసం 40 మంది బౌన్సర్లు.. ధర తెలిస్తే షాకే!
Badal Horse Royal Entry

Updated on: Nov 17, 2026 | 8:44 AM

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశు మేళా 2026లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా సినీ తారలు లేదా ప్రముఖ రాజకీయ నాయకులకు బౌన్సర్ల భద్రత ఉండటం మనం చూస్తుంటాం. కానీ పుష్కర్ మేళాలో బాదల్ అనే ఓ తెల్లటి గుర్రం ఏకంగా 40 మంది బౌన్సర్ల భద్రతా వలయం మధ్య రాజసంగా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

డోలు వాయిద్యాలు, నోట్ల వర్షం మధ్య స్వాగతం

ఆదివారం నాడు కేక్రీ ప్రాంతానికి చెందిన రాహుల్ జేత్వాల్ తన ప్రియమైన గుర్రం బాదల్ ను పుష్కర్ మేళా మైదానంలోని టెంట్ వద్దకు తీసుకువచ్చారు. ఈ ఎంట్రీ ఏ సినీ హీరోకూ తక్కువ కాకుండా అత్యంత వైభవంగా సాగింది. ముందు, వెనుక, ఇరువైపులా 40 మంది బౌన్సర్లు రక్షణ కవచంలా నడుస్తుండగా, డోలు వాయిద్యాల నడుమ బాదల్ మేళాలోకి ప్రవేశించింది. ఇదే సమయంలో యజమాని రాహుల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నోట్ల వర్షం కురిపించారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి జనం భారీగా తరలిరావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రూ. 5 కోట్లకు పైగా విలువైన మూడు గుర్రాలు

యజమాని రాహుల్ ఈసారి మేళాకు బాదల్ తో పాటు న్యూ బాదల్, విశ్వాస్ అనే మరో రెండు ప్రత్యేక జాతి గుర్రాలను కూడా తీసుకువచ్చారు. సుమారు 24 నెలల వయసున్న ఈ తెల్ల గుర్రం బాదల్‌ ఎత్తు 5.5 అడుగుల కంటే ఎక్కువగా ఉంది. 32 నెలల వయసున్న న్యూ బాదల్ ఎత్తు 67 అంగుళాలు. 8 ఏళ్ల వయసున్న గుర్రం విశ్వాస్ ఎత్తు సుమారు 65 అంగుళాలు. ఈ మూడు గుర్రాల మొత్తం విలువ రూ. 5 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాది కూడా పుష్కర్ మేళాలో బాదల్ జాతికి చెందిన మరో గుర్రానికి రూ. 11 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ యజమాని అమ్మడానికి నిరాకరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

అసలు ధరపై హార్స్ సొసైటీ ఏమంటోంది?

కోట్ల రూపాయల ధరల ప్రచారంపై ఆల్ ఇండియా మార్వారీ హార్స్ సొసైటీ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ పోసానా గతంలోనే స్పష్టతనిచ్చారు. యజమానులు తమ గుర్రాల సామర్థ్యాన్ని, అందాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి భారీ ధరలు చెబుతుంటారని, కానీ అవి కేవలం బ్రీడింగ్ కోసం మాత్రమే వినియోగిస్తారని, అమ్మకానికి కాదని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా పుష్కర్ మేళాలో బాదల్ రాయల్ ఎంట్రీ మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us