
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో బ్రతకడం ఒక యుద్ధం లాంటిది. కానీ, అక్కడ కష్టపడే మనస్తత్వం ఉంటే సంపాదనకు కొదవలేదని ఒక ఆటో డ్రైవర్ ఆదాయం నిరూపించింది. సోషల్ మీడియాలో ఒక యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. సదరు యూజర్ ముంబైలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్‌తో మాట కలిపారు. ఆ క్రమంలో డ్రైవర్ తన ఆదాయం గురించి వెల్లడిస్తూ.. తాను రోజుకు సుమారు రూ.2,500 సంపాదిస్తానని చెప్పారు. ఆదివారాలు సెలవు తీసుకున్నా, నెలకు 25 లేదా 26 రోజులు పని చేస్తే ఆదాయం రూ.70,000 నుండి రూ.75,000 వరకు ఉంటుందని ఆయన వివరించారు.
వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. అతడి సంపాదన తెలియగానే నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. మేము ఇంజనీరింగ్ చదివి ఏళ్ల తరబడి కష్టపడినా రూ.40,000 – రూ.50,000 జీతం రావడమే కష్టంగా ఉంది. ఆటో డ్రైవర్ ఆదాయం మమ్మల్ని ఆలోచింపజేస్తోంది అని కొందరు కామెంట్ చేశారు.
అయితే మరికొందరు ఈ ఆదాయం వెనుక ఉన్న కష్టాన్ని గుర్తు చేశారు. పొద్దున్నే 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎండలో, ట్రాఫిక్‌లో, కాలుష్యం మధ్య తిరగడం మామూలు విషయం కాదు. ఆ ఖర్చులు, ఆరోగ్యం మీద పడే ప్రభావం కూడా లెక్కలోకి తీసుకోవాలి అని అభిప్రాయపడ్డారు. ఈ రూ. 75,000 అనేది స్థూల ఆదాయం (Gross Income). ఇందులో నుండి సిఎన్‌జి (CNG) ఖర్చు, ఆటో మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఒకవేళ ఆటో అద్దెకు తీసుకుంటే ఆ అద్దె వంటివి తీసివేయాలి. ఇవన్నీ పోను ఆయన చేతికి నికరంగా రూ.45,000 నుండి రూ. 50,000 వరకు మిగిలే అవకాశం ఉందని చాలా మంది లెక్కలు వేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
వృత్తి ఏదైనా కష్టపడితే ఫలితం ఉంటుందని ఈ ఆటో డ్రైవర్ కథ మరోసారి నిరూపించింది. ముంబై లాంటి నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల నైపుణ్యం, ఓపిక ఉన్న డ్రైవర్లు మంచి ఆదాయాన్ని గడించగలుగుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…