Viral Video: మనోడి డ్రైవింగ్ ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. చూస్తే వావ్ అనాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసినప్పుడే ఆ రంగంలో వారు రాణించగలరు. బాగా డ్రైవింగ్ చేయగల నైపుణ్యం కూడా కొందరిలోనే ఉంటుంది.

Viral Video: మనోడి డ్రైవింగ్ ట్యాలెంట్ మామూలుగా లేదుగా.. చూస్తే వావ్ అనాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
Viral Video

Updated on: Oct 25, 2021 | 1:36 PM

Viral Video: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసినప్పుడే ఆ రంగంలో వారు రాణించగలరు. బాగా డ్రైవింగ్ చేయగల నైపుణ్యం కూడా కొందరిలోనే ఉంటుంది. అలా తమ నైపుణ్యంతో వారు ప్రమాదాలను కూడా తప్పించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోడ్డు కూడలి వద్ద వేగంగా వచ్చిన ఆటో.. కారును ఢీకొట్టబోతుంది. ఇంతలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారిస్తాడు. ఇదంతా రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయ్యింది. ప్రమాదాన్ని నివారించేందుకు ఆటో డ్రైవర్ ప్రదర్శించిన డ్రైవింగ్ స్కిల్స్ నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఈ వీడియో పదేపదే చూడాలనిపించేలా ఉంది.

మూడు చక్రాల వాహనాన్ని ఎఫ్1 రేస్ డ్రైవర్ నడుపుతున్నట్లు ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. డ్రైవర్‌కు అసాధారణమైన డ్రైవింగ్ స్కిల్స్ ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. పాకిస్థాన్‌పై టీమిండియాలో ఇలాగే గెలుస్తుందని భావించినట్లు మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

Also Read..

Viral Video: నెటిజన్ల మనసు దోచుకుంటున్న చిన్నారి సెల్యూట్‌.. వీడియో చూస్తే శభాష్‌ అంటారు..

అదిరిపోయే ఆఫర్‌..చికెన్‌, లాలిపాప్స్‌ తింటే చాలు లక్షల్లో జీతం.. ఎక్కడో తెలుసా..?

Loading...
Unable to load recommendations.
Follow Us