Anand Mahindra: ఈ మట్కా మ్యాన్‌ మార్వెల్‌ను మించిన సూపర్‌ హీరో…ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..

|

Oct 25, 2021 | 10:51 AM

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ....

Anand Mahindra: ఈ మట్కా మ్యాన్‌ మార్వెల్‌ను మించిన సూపర్‌ హీరో...ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..
Follow us on

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఆలోచనాత్మక, సందేశాత్మక పోస్ట్‌లతో తన అభిమానులు, ఫాలోవర్లను అలరించడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఇక సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మరో స్ఫూర్తిదాయకమైన వీడియోను ట్విట్టర్‌ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ‘బోలెరో’ వాహనాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్న ఓ వ్యక్తి గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు. ఇది ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

‘మట్కా మ్యాన్‌’ గా దాహం తీరుస్తూ!
దక్షిణ దిల్లీలో ఉండే 72 ఏళ్ల అలగ్‌ నటరాజన్‌ కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌ నుంచి ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటి నుంచి తన దగ్గరున్న మహీంద్రా బోలెరో వాహనాన్ని ‘మట్కా(తాగునీటి కుండ)’ గా మార్చి పేద ప్రజల దాహం తీరుస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకే నిద్రలేచి తన వాహనంతో దక్షిణ దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మట్టి కుండలను తాగునీటితో నింపుతున్నారు. అదేవిధంగా నిర్మాణ రంగంలో ఉండే కార్మికుల కోసం ప్రత్యేకంగా పోషకాహార సలాడ్‌లు తయారుచేసి పంచుతున్నారు. దారిలో కనిపించే సెక్యూరిటీ గార్డ్‌లు, డ్రైవర్లకు కూడా తన ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇలా తన సేవా దృక్పథంతో స్ఫూర్తిగా నిలుస్తోన్న నటరాజన్‌ గురించే ట్విట్టర్‌లో తెలియజేశారు ఆనంద్‌ మహీంద్రా. ఇందులో భాగంగా అతనిని మార్వెల్‌ హీరోతో పోల్చారు.

అతను మార్వెల్‌ కంటే సూపర్‌ హీరో!
‘మార్వెల్‌ కంటే శక్తి వంతమైన సూపర్‌ హీరో ఈ మట్కామన్‌(నటరాజన్‌). అతను ఇంగ్లండ్‌లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌. క్యాన్సర్‌ను కూడా జయించాడు. పేదలకు ఆపన్నహస్తం అందించడానికి ఇండియాకు తిరిగివచ్చాడు. మీ సామాజిక సేవ కోసం మా బోలెరో వాహనాన్ని వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు మహీంద్రా.

Also Read:

News Watch: ప్లీనరీతో పింక్ సిటీ గా హైదరాబాద్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్.. (లైవ్ వీడియో)

Online order: సాక్స్ కోసం ఆర్డర్ ఇచ్చాడు.. ఓపెన్‌ చేసి షాక్‌..! ట్విట్టర్‌లో షేర్‌చేసిన వ్యక్తి.. దిగొచ్చిన సంస్థ.. (వీడియో)

Axis Bank Diwali Offer: యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌..! గృహ రుణాలపై 12 ఈఎంఐలు రద్దు.. (వీడియో)