వాయువేగంతో హనుమాన్‌ చాలీసా చదివేస్తున్న అమెరికన్ వ్యక్తి.. నెట్టింట ప్రశంసల వర్షం..!

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక వింతైన, ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా అమెరికాకు చెందిన ఒక వ్యక్తి చేసిన ఆధ్యాత్మిక ప్రయత్నం ఇంటర్నెట్‌లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ అనే వ్యక్తి హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, సాధారణ వేగం కంటే డబుల్ స్పీడ్ లో పఠించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వాయువేగంతో హనుమాన్‌ చాలీసా చదివేస్తున్న అమెరికన్ వ్యక్తి.. నెట్టింట ప్రశంసల వర్షం..!
American Man Hanuman Chalisa

Updated on: Oct 03, 2026 | 9:47 AM

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ అనే వ్యక్తి హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, తప్పులు లేకుండా డబుల్ స్పీడ్ వేగంతో పఠించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ భక్తి సంప్రదాయం పట్ల అతడికి ఉన్న ఆసక్తిని, కృషిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే చాలామంది కంటే నిక్ ఎంతో స్పష్టంగా చదివారని కొనియాడుతున్నారు.

సాధారణంగా హనుమాన్ చాలీసాలోని సంస్కృత, అవధి శ్లోకాలను స్పష్టంగా ఉచ్ఛరించడానికి సమయం పడుతుంది. కానీ, నిక్ డీర్‌మన్ ఎలాంటి తడబాటు లేకుండా అత్యంత వేగంగా, సరైన లయతో చాలీసాను పూర్తి చేశాడు. శ్లోకాలు పఠిస్తున్నంతసేపు అతడు చూపించిన ఏకాగ్రత, పట్టుదల నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మీరు లిరిక్స్ గూగుల్ చేసి సరిచూసుకోవచ్చు అంటూ సరదాగా క్యాప్షన్ జతచేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో నెట్‌లో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. విదేశీయుడైనప్పటికీ భారతీయ ఆధ్యాత్మికత, భక్తి సంప్రదాయం పట్ల అతడు చూపిన గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. చాలామంది నెటిజన్లు నిక్ ఉచ్ఛారణను, భక్తిశ్రద్ధలను ప్రశంసించారు. చాలామంది స్వదేశీయుల కంటే మీరు హనుమాన్ చాలీసాను చాలా స్పష్టంగా, చక్కగా పఠించారు అని కొందరు కామెంట్ చేశారు.

మరికొందరు అతడి నైపుణ్యానికి, కృషికి పెద్ద ఎత్తున గౌరవం ప్రకటిస్తూ, వేగం కంటే అతడి శ్రద్ధ గొప్పదని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, నిక్ డీర్‌మన్ వేగంగా, స్పష్టంగా చేసిన హనుమాన్ చాలీసా పఠనం సరిహద్దులు, సంస్కృతులకు అతీతంగా ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us