Viral: ఎయిర్‌పోర్ట్‌ మహిళ వింత ప్రవర్తన.. స్కానింగ్‌లో బట్టబయలు అయిన అసలు నిజం

|

Sep 28, 2024 | 12:31 PM

ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక బలగాలు నిత్యం గస్తీ కాస్తూ ఉంటాయి. అంతేనా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మోనిటరింగ్ చేస్తూ ఉంటారు. అయినా కొందరు రిస్క్ చేసి అడ్డంగా చిక్కుతూ ఉంటారు.

Viral: ఎయిర్‌పోర్ట్‌ మహిళ వింత ప్రవర్తన.. స్కానింగ్‌లో బట్టబయలు అయిన అసలు నిజం
X Ray
Follow us on

ఎయిర్‌పోర్ట్స్‌లో భద్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉగ్ర శక్తులు ప్రవేశించకుండా, ఎటువంటి అక్రమ రవాణాకు తావు లేకుండా తనిఖీలు ఉంటాయి. కొన్నిసార్లు అక్రమార్కలు ఇల్లీగల్‌గా డ్రగ్స్ లేదా వన్యప్రాణుల్ని రవాణా చేయడానికి యత్నించి స్కానింగ్ సమయంలో పట్టుబడుతూ ఉంటారు. ఇటీవల, సాత్ ఆఫ్రీకాలోని ఓ విమానాశ్రయంలో ఒక మహిళను తనిఖీ చేయగా.. బాడీ స్కాన్‌లో ఆమె కడుపులో కొకైన్ బుల్లెట్లు కనుగొన్నారు. ఇది చూసిన భద్రతా అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. 

డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఇటీవల 30 ఏళ్ల నమీబియన్ మహిళ బ్రెజిల్‌లోని సావో పాలో నుంచి జోహన్నెస్‌బర్గ్‌లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిస్తోంది. ఆమె డ్రగ్స్ స్మగ్లర్. ఆమె ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ముందుగానే సమాచారం అందింది. దీంతో ఆమె తన గమ్యస్థానంలో దిగి, ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసి బయటకు వచ్చిన వెంటనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ అంతా క్షుణ్ణంగా చెక్ చేసినా ఆమె వద్ద ఏం లభించలేదు. పక్కా సమాచారం ఉండటంతో.. ఎయిర్‌పోర్ట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ ఎక్స్-రే ద్వారా స్కాన్ చేశారు. ఆ రిపోర్ట్స్‌లో ఆమె కడుపులో ట్యాబ్లెట్లు లాంటివి ఏవో కనిపించాయి. విచారించగా అవి కొకైన్ బుల్లెట్స్ అని తేలింది.  ఆపరేషన్‌ చేసి కడుపులోంచి దాదాపు 60 బుల్లెట్లను బయటకు తీశారు. నిందితురాలు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉందని.. పోలీసు ప్రతినిధి బ్రిగ్ అథ్లెండా మాథే తెలిపారు. 

దక్షిణాఫ్రికా పోలీసు సర్వీస్ జాతీయ కమిషనర్ జనరల్ ఫెన్నీ మాసెమోలా అధికారుల ప్రయత్నాలను ప్రశంసించారు. OR టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో నేర కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఫోర్స్ వర్క్ చేసిన తీరు అభినందనీయమన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..