ఆనంద్ మహీంద్ర ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహీంద్ర గ్రూప్ ఛైర్మన్‌గా, గొప్ప పారిశ్రామికవేత్తగా ప్రపంచానికి పరిచయమున్న ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా వేదికగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆనంద్ మహీంద్రకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో అద్భుత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఆయనకు అలవాటు.
ఇందులో ఎన్నో మోటివేషనల్ వీడియోలు కూడా ఉంటాయి. ఆసక్తికరంగా ఉండే వీడియోలను పంచుకునే ఆనంద్ మహీంద్ర.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను నెటిజన్లను షేర్ చేసుకున్నారు. మండే మోటివేషన్ పేరుతో ఈ వీడియోను పంచుకున్నారు మహీంద్ర. వివరాల్లోకి వెళితే.. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోలో మోటార్‌తో నడిచే ఓ చిన్న వాహనాన్ని రెండు బెంచ్‌ల మధ్య గుండా తీసుకెళ్తుంటారు.
ఇందుకోసం రెండు బెంచీల మధ్య బ్రిడ్జ్‌లాంటి నిర్మాణాలను చేపడతారు. అయితే మధ్యలోకి వెళ్లగానే ఆ వాహనం ఆగిపోతుంది. దీంతో దాని చక్రాల్లో చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ స్టార్ట్ చేస్తారు. దీంతో వాహనం ఈజీగా వెళ్లిపోతుంది. ఇలా సమస్య ఎదురైనా ప్రతీసారి ఒక మార్పు చేస్తూ వాహనాన్ని నడిపిస్తుంటారు. చివరికి దారంపై కూడా ఆ బొమ్మ వాహనం నడిచేలా మార్పులు చేస్తారు.
There is no chasm that creative and solution-oriented thinking won’t help you cross…#MondayMotivation
— anand mahindra (@anandmahindra) November 18, 2024
అక్కడున్న మార్గానికి అనుగుణంగా వాహనంలో మార్పులు చేర్పులు చేయడం వల్లే ప్రయాణం సాధ్యమైంది. ఇదిగో ఇదే పాయింట్‌ను మోటివేషన్‌గా మార్చారు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియోను షేర్ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు అనే క్యాప్షన్‌తో పాటు మండే మోటివేషన్ అనే ట్యాగ్‌ను జత చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..