Viral Video: నిమ్మకాయ టేస్ట్ చూశాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మూమూలుగా లేవుగా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో

|

Aug 08, 2022 | 5:16 PM

కుక్కలు (Dogs) చాలా ఫన్నీ, స్నేహపూర్వక జంతువులు. అందుకే వీటిని పెంచుకునేందుకు ప్రజలు ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యధికంగా పెంపుడు జంతువులు కుక్కలు మాత్రమేనని అందరికీ తెలిసిందే. కొంతమంది రక్షణ కోసం పెంచుకుంటే, మరి కొందరు....

Viral Video: నిమ్మకాయ టేస్ట్ చూశాక ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మూమూలుగా లేవుగా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో
Dog Tasting Lemon
Follow us on

కుక్కలు (Dogs) చాలా ఫన్నీ, స్నేహపూర్వక జంతువులు. అందుకే వీటిని పెంచుకునేందుకు ప్రజలు ఇష్టపడతారు. ప్రపంచంలో అత్యధికంగా పెంపుడు జంతువులు కుక్కలు మాత్రమేనని అందరికీ తెలిసిందే. కొంతమంది రక్షణ కోసం పెంచుకుంటే, మరి కొందరు మాత్రం వాటిని కుటుంబసభ్యులతో సమానంగా చూసుకుంటారు. వాటిని ప్రేమిస్తారు, అనుబంధాన్ని పెంచుకుంటారు. ప్రస్తుతం పెట్ ఆనిమల్స్ కు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న క్లిప్ లో ఒక వ్యక్తి నిమ్మకాయలు కోస్తుంటాడు. అతని పక్కనే తాను పెంచుకుంటున్న కుక్క ఉంటుంది. నిమ్మకాయలను చూసిన వెంటనే కుక్కకు తినాలని అనిపిస్తుంది. దీంతో అతను ఓ ముక్కను కుక్క నోట్లో పెడతాడు. కుక్క దానిని నోటిలో పెట్టగానే వెంటనే ఉమ్మేసి ఫన్నీగా రియాక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తలపైకి ఎక్కి ఆడుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియో కచ్చితంగా నవ్వు తెప్పిస్తుంది. యజమానికి కుక్కకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ వీడియో తెలుపుతుంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల 67 వేల మందికి పైగా వీక్షించగా, 14 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కుక్క ఎక్స్ప్రెషన్స్ సూపర్ అని, కుక్క చాలా ముద్దొస్తుందని మరికొందకు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి