రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది?

సోషల్ మీడియా రీల్స్ మోజులో నేటి యువత ఎలాంటి విచిత్ర పనులకైనా వెనుకాడటం లేదు. వైరల్ కావడం కోసం, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం లేదా వింత పనులు చేసి వార్తల్లో నిలవడం మనం తరచూ చూస్తుంటాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటువంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విదేశీ ట్రెండ్ చూసి ప్రేరణ పొందిన ఒక యువకుడు తన కారునే ఒక కిస్సింగ్ కార్‌గా మార్చేశాడు.

రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరింది.. కారు నిండా ప్రియురాలి ముద్దులతో నింపేశాడు..! సీన్‌ కట్‌చేస్తే తిక్క బాగా కుదిరింది?
3400 Kiss Marks On Car

Updated on: Aug 25, 2026 | 8:16 AM

సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల పిచ్చి ఒక యువకుడిని చిక్కుల్లో పడేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విదేశీ ట్రెండ్ చూసి, తన కారును కిస్సింగ్ కార్‌గా మార్చాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ సుమారు మూడున్నర గంటలు శ్రమించి, రెడ్ లిప్‌స్టిక్‌తో కారు మొత్తం 3,400 ముద్దుల గుర్తులను పెట్టింది. ఈ కారుతో తీసిన రీల్‌కు 55 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ కారు రోడ్డుపైకి రావడంతో మొదలైంది అసలు కథ..! అసలేం జరిగింది?

గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటాడు. తన సోషల్ మీడియా ఖాతాలో లైకులు, వ్యూస్ పెంచుకోవడానికి ఒక వినూత్న ఆలోచన చేశాడు. విదేశాలలో వైరల్ అయిన ఒక ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన తెల్లటి స్విఫ్ట్ కారుపై ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ దాదాపు మూడున్నర నుండి నాలుగు గంటల పాటు శ్రమించి, అనేక లిప్‌స్టిక్‌లను ఉపయోగిస్తూ కారు బాడీ మొత్తం మీద సుమారు 3,400 కిస్ మార్కులను వేసింది. అనంతరం ఆ కారుతో నగరంలో వేగంగా ప్రయాణిస్తూ ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కిస్సింగ్ కార్ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయిపోయింది. కేవలం ఒక్క రోజులోనే ఈ రీల్‌కు ఏకంగా 55 లక్షలకు పైగా (5.5 మిలియన్లు) వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. రహదారిపై వాహనం రంగు, రూపాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్చడం, తీవ్ర వేగంతో వాహనం నడపడం మోటార్ వాహనాల చట్టం కింద నేరమని పోలీసులు గురించారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన గోలా కా మందిర్, థాటీపూర్ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, యువకుడిని స్టేషన్‌కు రప్పించారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను పోలీసులు ఆదిత్యకు రూ. 5,500 జరిమానా విధించారు. అదనంగా కారు అద్దాలపై ఉన్న నల్లటి ఫిలింను కూడా తొలగించారు. అనంతరం సదరు యువకుడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే స్వయంగా నీళ్లతో రుద్ది కారుపై ఉన్న 3,400 లిప్‌స్టిక్ గుర్తులను కడిగివేశాడు. రీల్స్ కోసం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, సామాజిక మాధ్యమాలలో చవకబారు ప్రచారం కోసం రహదారి భద్రతను పణంగా పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us