Yuga Thulasi Foundation: దేశంలో ఎక్కడా లేని విధంగా గోవధ.. గవర్నర్‌కు యుగ తులసి ఫౌండేషన్ ఫిర్యాదు

|

May 09, 2022 | 7:20 AM

గోవుల అక్రమ రవాణా, గోవధను నిరోధించేలా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్ శివకుమార్ గవర్నర్‌ను కోరారు.

Yuga Thulasi Foundation: దేశంలో ఎక్కడా లేని విధంగా గోవధ.. గవర్నర్‌కు యుగ తులసి ఫౌండేషన్ ఫిర్యాదు
Yuga Thulasi Foundation
Follow us on

Yuga Thulasi Foundation: దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణలో విచ్చలవిడిగా గోవధ జరుగుతోందని యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్ శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి అంబులెన్సుల్లో కూడా ఆవులను రవాణా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసి, రాష్ట్రంలో (Cow slaughter in Telangana) గోవుల అక్రమ రవాణా, గోవధపై ఫిర్యాదు చేశారు శివకుమార్. గోవుల అక్రమ రవాణా, గోవధను నిరోధించేలా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. రాబోయే బక్రీద్‌కి గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ (Governor Tamilisai) ను కోరినట్టు చెప్పారు శివకుమార్‌.

గోవధకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ ఎప్పటినుంచో పోరాటం చేస్తోంది. గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో DGPని కూడా కోరారు శివకుమార్. అటు పశువుల సంత జరిగే చోట నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు. గోవధపై పలు రూపాల్లో నిరసనలు తెలిపిన శివకుమార్, ప్రతి ఏటా తాము విజ్ఞప్తులు చేస్తున్నామని గుర్తుచేశారు. ఇప్పటికైనా భవిష్యత్తులో గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా. ఈ కార్యక్రమంలో పలువురు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read:

ఇవి కూడా చదవండి

Kamareddy Accident: డ్రైవర్ చేసిన ఆ తప్పే ప్రాణాలు మింగింది.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..

Minister KTR Twitter: ట్వీట్లతో ఉక్కిరి బిక్కిరి చేసిన నెటిజన్లు.. కూల్‌గా ఆన్సర్‌ చేసిన మంత్రి కేటీఆర్‌